in

సైనికుడు….అగ్నివీరుడు అవుతాడా! అసలేంటీ అగ్నిపత్ స్కీము?

ఇప్పుడు సామాన్యుడు సైనికుడు అవ్వటం అసాధ్యం అనిపిస్తుంది. సామాన్యుడు భారత సైన్యంలో మామూలు సైనికుడిగా చేరాలంటే  పర్మినెంట్ కమిషన్ ద్వారా మరియు షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా చేరేవారు. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం అగ్నిపత్ స్కీమును ప్రవేశపెట్టింది. తద్వారా మామూలు సైనికుడవ్వాలంటే అగ్నిపత్ స్కీం ఒక్కటే మార్గం అయ్యింది. మునపటితో పోలిస్తే ఈ అగ్నిపత్ స్కీములో వచ్చే లాభాలు తక్కువ కావడం వల్ల యువత సైనికునిగ మారాల వద్దా అని సంకోచిస్తున్నారు.

అసలేంటీ అగ్నిపత్ స్కీము?

17.5 నుంచి 21 సంవత్సరాల వయసుగల 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించినవారు అగ్నిపత్ స్కీం ద్వారా సైన్యంలో ప్రవేశించవచ్చు. అగ్నిపత్ స్కీం ద్వారా ప్రవేశించినవారు నాలుగేళ్ల పాటు ట్రైనింగ్ పిరియడ్లో ఉంటారు. నాలుగు సంవత్సరాలలో మొదటి సంవత్సంలో నెలకి ముపైవేలివ్వగా,చివరి సంవత్సరంలో నెలకు నలభై వేలు జీతంగా అందిస్తారు. అయినప్పటికీ వారి జీతంలో 70 శాతం మాత్రమే వారి చేతికి ఇస్తారు. మిగతా 30 శాతం అగ్నివీర్ ఫండ్లోకి వెళ్తుంది. అంతే మొత్తం ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. చివరి సంవత్సరం ముగిసిన తరువాత కేవలం 25 శాతం మంది మాత్రమే అగ్నివీరులుగా సైన్యంలోకి ఎంచుకోబడతారు. మిగతా 75 శాతం మంది తిరిగి ప్రజలలోకి పంపించబడతారు. 11 నుంచి 12 లక్షల వరకు చివరిగా అందచేయగా,వారికి ఆపై ఎటువంటి పెన్షన్ మిగతా బెనిఫిట్స్ లభించవు.

అయితే ఆ నాలుగేళ్లలో డిగ్రీ కూడా అందచేస్తామని ప్రభుత్వం చెబుతున్నా, అన్ని సంవత్సరాలు పడిన కష్టం వృథా ప్రయాస అవుతుందేమోనని సైనికులుగా మరాలనుకునే యువత సతమతమవుతున్నారు. మునుపు ఉన్న ప్రవేశ విధానంతో పాటు ఈ విధానం అమల్లోకి తెచ్చుంటే బాగుండేదని, కేవలం అగ్నిపత్ ఒక్కటే ప్రవేశ విధానంగా ఉండటం ఇబ్బంది కరమని,ఈ విధానం సమంజసం కాదని  యువత వాపోతున్నారు.

What do you think?

123 Points
Upvote Downvote

రివ్యూ : లవ్ టుడే సినిమా (ఇప్పుడు Netflix లో)

చీకటి పడితే అసలు అక్కడ ఊరు ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు