“అప్పుడు అలా అన్నందుకు సారీ.” రవితేజతో అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ హీరో రవితేజకు సారీ చెప్పారు. అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు సారీ చెబుతున్నానని అన్నారు.
తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ నెల 20న విడుదలకు సిద్దం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించారు.
కాగా ఈ సినిమా 1988లో రవితేజ అనుపమ్ ఖేర్ ను ఆటోగ్రాఫ్ అడిగితే కుదరదని చెప్పారట. ఈ విషయం గురించి మాట్లాడిన అనుపమ్ సారీ చెప్పారు. “అప్పుడు అలా అన్నందుకు ఇప్పుడు సారీ చెబుతున్నాను” అని అన్నారు.