బెంగళూరులోని టిసిఎస్ క్యాంపస్ కు బాంబు బెదిరింపు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) కార్యాలయంలో బాంబు పెట్టారని పోలీసులకు సమాచారం అందింది. పొలీసులు విచారిస్తే అసలు విషయం బయటపడింది.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) (TCS) కార్యాలయంలో బాంబు ఉందని ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మంగళవారం బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని టిసిఎస్ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పొలీసులు టిసిఎస్ క్యాంపస్ ను పూర్తిగా సోదా చేశారు. అనంతరం విచారణ జరుపగా టీసీఎస్ మాజీ ఉద్యోగి కంపెనీ పై కోపంతో ఇలా కాల్ చేసినట్లు పోలీసులకు తెలిసింది.