in ,

“బాలికల విద్యకు అయ్యే ఖర్చు ప్రభుత్వానిదే” – సీఎం శివరాజ్

“బాలికల విద్యకు అయ్యే ఖర్చు ప్రభుత్వానిదే” – సీఎం శివరాజ్

శివరాజ్ సింగ్ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు. బాలిక విద్యకు ఖర్చు కూడా ప్రభుత్వమే పెడుతుందని తెలిపారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (మహిళా నియామకాల ప్రత్యేక చట్టం) నిబంధన 1997కు సవరణ చేసి 35 రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం పూనుకుందని తెలిపారు.

మరో వైపు బాలిక విద్యకు అయ్యే ఖర్చు కూడా ఇక నుంచి ప్రభుత్వమే భరిస్తుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

What do you think?

“లంచం తీసుకోవడం తప్పు కాదు” – బొంబాయి హై కోర్టు

“సనాతన ధర్మంపై మాట్లాడటం ఆపే ప్రసక్తే లేదు” – ఉదయనిది స్టాలిన్