in

యూట్యూబ్‌, టెలిగ్రామ్, ట్విట్టర్‌ లకు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

యూట్యూబ్‌, టెలిగ్రామ్, ట్విట్టర్‌ లకు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సైట్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. సెక్సువల్ అబ్యూస్‌ మెటీరియల్‌ను వెంటనే సోషల్‌ మీడియా వేదికల నుంచి తొలగించాలని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం సోషల్‌ మీడియా సైట్స్‌లో అశ్లీలతను తగ్గించే దిశగా మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (electronics and information technology) మంత్రిత్వ శాఖ యూట్యూబ్‌, టెలిగ్రామ్, ఎక్స్‌ (ట్విట్టర్‌), ఇన్స్టా గ్రామ్ (instagram) వంటి సోషల్‌ మీడియా సైట్స్‌కు నోటీసులు పంపింది.

చైల్డ్‌ సెక్సువల్ అబ్యూస్‌ మెటీరియల్‌ను వెంటనే ఆయా సోషల్‌ మీడియా వేదికల నుంచి తొలగించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏ సోషల్ మీడియా సైట్ అయినా కేంద్రం అందించిన సూచనలను సరిగ్గా పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా సైట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

What do you think?

అమెరికాలో 23 వేల ఏళ్ల పురాతన మానవ పాదముద్రలు

‘ఆదిపురుష్’ కేసులపై విచారణ అనవసరం – సుప్రీం కోర్టు