in

మోత మోగిస్తున్న ఉల్లి ధర.శుభవార్త చెప్పిన కేంద్రం

మోత మోగిస్తున్న ఉల్లి ధర. శుభవార్త చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పింది. ఉల్లిని సబ్సిడీ కింద రూ.25 కే విక్రయిస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం ఉల్లి ధర మోత మోగుతోంది. కొద్ది రోజుల క్రితం రూ.30-రూ.40 వరకు ఉల్లి ధర ప్రస్తుతం రూ. 80 నుంచి రూ.100 లకు చేరింది. ఈ క్రమంలో ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీంతో మరో సారి ఉల్లి ధర సామాన్యుడికి భారంగా మారింది.

ఈ నేపథ్యంలో బఫర్ స్టాక్ నుంచి రిటైల్ మార్కెట్లలోకి లక్ష టన్నుల ఉల్లిని విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉల్లిని సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.25 కే విక్రయిస్తోంది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత తగ్గనున్నాయని.. దీంతో సామాన్యుడికి భారీ ఊరట లభిస్తుందని కేంద్రం పేర్కొంది.

What do you think?

విక్రమ్ ఆ మాటలు నవ్వుతూ అన్నారు – “తంగలాన్” టీమ్

సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభించనున్న దిల్ రాజు