in ,

తన ప్రాణాలు అడ్డుపెట్టి కుటుంబాన్ని కాపాడుకున్నాడు – వైరల్ వీడియో

తన ప్రాణాలు అడ్డుపెట్టి కుటుంబాన్ని కాపాడుకున్నాడు – వైరల్ వీడియో

ఓ వ్యక్తి కుటుంబాన్ని కాపాడుకుని తన ప్రాణాలు వదిలాడు. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కంటతడి పెట్టిస్తుంది.

దక్షిణ ఇజ్రాయెల్ (Israel)లో గత శనివారం హమాస్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ఇళ్లల్లోకి చొరబడి మరీ అమాయక ప్రజలను కిరాతకంగా చంపుతున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు తన ఇంట్లోకి రావడాన్ని గమనించిన ఓ వ్యక్తి, వెంటనే తన కుటుంబాన్ని తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. తన పిల్లలను, ఇతర కుటుంబ సభ్యులను వేగంగా కిటికీ నుంచి బయటకు పంపించేశాడు. చివరగా తను కూడా తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతన్ని గమనించిన ముష్కరులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ కిటికీ దగ్గరే అతను చనిపోయాడు.

సీసీ టీవీలో రికార్డ్ అయిన ఈ హృదయవిదారకమైన ఘటనను ఇజ్రాయెల్ జర్నలిస్ట్ హనన్య నఫ్తాలీ (Hananya Naftali) తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ లో పోస్ట్ చేశారు. తన ప్రాణాలు అడ్డు పెట్టి కుటుంబాన్ని కాపాడుకున్న హీరో అని అతడ్ని కొనియాడారు. అయితే ఆయన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకున్న కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారా లేదా అనేది ఇంకా తెలీదు.

What do you think?

‘ఆదిపురుష్’ కేసులపై విచారణ అనవసరం – సుప్రీం కోర్టు

కేజీ రూ. 10 కి కూడా కొనే పరిస్థితి లేని టమాటా