in ,

దానికదే రిపేర్ చేసుకునే సరికొత్త ప్లాస్టిక్‌

దానికదే రిపేర్ చేసుకునే సరికొత్త ప్లాస్టిక్‌

దానికదే రిపేర్ చేసుకునే ప్లాస్టిక్‌ను జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది సముద్ర జీవులకు ఆహారంగా కూడా మారుతుందని తెలిపారు.

తనకు తానే రిపేర్ చేసుకుని, పాక్షికంగా బయో డీగ్రేడబుల్ అయ్యే ప్లాస్టిక్‌ను జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వ్రిటిమర్ ఎపోక్సీ రెజీన్ ఆధారంగా ఈ సరికొత్త ప్లాస్టిక్‌ను రూపొందించారు. ఈ ప్లాస్టిక్‌ను వేడి చేసిన తర్వాత కావాల్సిన రూపంలోకి మార్చుకోవచ్చు.

అలాగే ఈ ప్లాస్టిక్‌ సముద్ర జలాల్లో కలిసిన జీవులకు ఏ ప్రమాదం ఉండదని.. ఇది సముద్రంలో కలిసిన వెంటనే బయోడీగ్రేడబుల్ అయ్యి సముద్ర జీవులకు ఆహారంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

What do you think?

సీఎం జగన్ పై విరుచుకుపడ్డ తెదేపా నేత వెంకటరమణారెడ్డి

మూడే నిమిషాల్లో కోవిడ్ ను నిర్ధారించే పరికరం