in ,

రామ్ చరణ్ సినిమాలో సాయి పల్లవి నటిస్తోందా?

రామ్ చరణ్ సినిమాలో సాయి పల్లవి నటిస్తోందా?

సాయి పల్లవి రామ్ చరణ్ తో కలిసి నటించబోతోందట. గేమ్ చేంజర్ (game changer) తరువాత చరణ్ చేయబోయే సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట.

ఉప్పెన సినిమాతో బారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు నుంచి ఇప్పటి వరకు ఇంకో సినిమా రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నారని అప్పట్లో ఒక వార్త చక్కర్లు కొట్టినప్పుటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల అది పట్టాలెక్క లేదు. ఆ తరువాత ఇటీవల ఆయన రామ్ చరణ్ కు ఒక కథ చెప్పడం అది ఓకే అవ్వడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ సినిమాను ప్రస్తుతం ఆర్సీ 16 అని అంటున్నారు. ఇది గేమ్ చేంజర్ (game changer) తరువాత పట్టాలెక్కుతుంది. అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

దీంట్లో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి (sai pallavi) హీరోయిన్ గా నటించబోతోందని మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీంట్లో విజయ్ సేతపతి విలన్ గా చేస్తున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సాయి పల్లవి కూడా దీంట్లో భాగం కాబోతోందని మాటలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా దీన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ , ఇంకా వృద్ది సినిమాస్ కలిసి నిర్మించబోతున్నాయని సమాచారం.

What do you think?

భూమి వైపు దూసుకొస్తున్న చంద్రయాన్ – 3

ఇతను లక్కీ డ్రాలో రూ. 45 కోట్లు గెలుచుకున్నాడు