in ,

“ఆర్ఆర్ఆర్ ఒక అద్బుతం” ‌- స్టీఫెన్ స్పీల్బర్గ్.

ప్రపంచ ప్రక్యాతి చెందిన దర్శకుడు స్టీఫెన్ స్పీల్బర్గ్ “ఆర్ఆర్ఆర్” తో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన జక్కనను ప్రశంసలతో ముంచెత్తారు. “ఆర్ఆర్ఆర్” సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ తన భావనను రాజమౌళితో పంచుకున్నారు. ప్రపంచ అగ్ర దర్శకుడు, తనకు ఇష్టమైన దర్శకుడు అయిన స్టీఫెన్ స్పీల్బర్గ్ ఇలా మెచ్చుకోవడంతో రాజమౌళి కూడా చాలా సంతోషించారు.

స్టీఫెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన “ది ఫాబెల్మాన్స్” (the fabelmans) ఫిబ్రవరి 10న విడుదల కాబోతున్న సందర్భంగా ఆ సినిమాను కో – ప్రొడ్యూస్ చేసిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ స్టీఫెన్ స్పీల్బర్గ్ , రాజమౌళిలతో జూమ్లో ఒక ఇంటర్వ్యును నిర్వహించింది.ఈ ఇంటర్వ్యూలో స్పీల్బర్గ్ “ఆర్ఆర్ఆర్” గురించి మాట్లాడారు.
ఆర్ఆర్ఆర్ చాలా అద్భుతంగా.. కనులకు విందుగా ఉందని స్పీల్బర్గ్ అన్నారు. సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం చాలా బాగుందని.. అధ్బుతమైన అనుభూతిని ఇచ్చిందని రాజమౌళిని అభినందించారు.

తన అభిమాన దర్శకుడు ఇలా ప్రశంసలతో ముంచెత్తుతుండడంతో రాజమౌళి ఎంతో సంతోషించారు. “చైర్లో నుంచి లేచి డాన్స్ చేయాలని పిస్తుంది” అంటూ ఆయన అన్నారు.
ఇక ప్రపంచాన్నే ఒక ఊపు ఊపేసిన “ఆర్అర్ఆర్” లోని “నాటు నాటు” పాట బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించిందన్న విషయం తెలిసిందే.

What do you think?

కళ్యాణ్ రామ్ “అమిగోస్” సినిమా రివ్యూ

జడేజాకు జరిమానా విధించిన ఐసీసీ.ఫీజ్లో 25% కోత!