in ,

టాప్ 5 ప్రైమ్ వీడియో సినిమాలు,సీరీస్లు #పార్ట్ 1

టాప్ 5 ప్రైమ్ వీడియో సినిమాలు,సీరీస్ లు 

ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సినిమా లేదా సీరీస్ చూస్తూ వత్తిడిని,అలసటను మర్చిపోవాలని కోరుకుంటారు. అలా చూడాలనుకునే ప్రతి ఒక్కరి దగ్గర ఓ.టి.టి సబ్స్క్రిప్షన్లు ఉన్నా సరే వాళ్ళకి నచ్చిన సినిమా ఏ ఓ.టి.టిలో ఉందో వెతుక్కునే సమయం ఉండదు. అలాంటి వారికి వేతుక్కునే అవసరం లేకుండా అందరికీ వినోదాన్ని పంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలోని సినిమాలు,సీరీస్ లు మీ కోసం.

 

1.సీతారామమం (Sita Ramam 2022)

లెఫ్ట్‌నెంట్ రామ్,సీత కోసం రాసిన లేఖ అనుకోని సందర్భాల వల్ల సీతకు అందించే బాధ్యత  అప్రిన్ పై పడుతుంది.ఆ లేఖ సీతకు అందించిందా లేదా అన్నదే ఈ సినిమా.

అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ హృదయాన్ని కదిలించే ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. తనదైన కొత్తధనంతో,చక్కని సంగీతంతో మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆలాంటి అనుభూతి పొందాలంటే ఈ ప్రేమకథను చూడాల్సిందే.

 

2.మోడ్రన్ లవ్ ముంబై (Modern Love Mumbai 2022)

ముంబై లో నివసించే కొంతమంది వ్యక్తుల జీవితాలలో ఎటువంటి సంఘటనలు జరిగాయి అనేది ఈ మోడ్రన్ లవ్ ముంబై. అమెరికన్ సీరీస్ మోడ్రన్ లవ్కు ఆధారంగా తెరకెక్కిన ఈ సీరీస్ 6 విభిన్నమైన కథలతో తనదైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీరీస్ ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుంది. దర్శకుడు నుపుర్ ఆస్థాన ఈ సీరీస్ ను తెరకెక్కించారు.

 

  1. రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ (Rocketry: The Nambi Effect 2022)

పద్మభూషణ్ గ్రహీత,ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేసిన యస్.నంబి నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రి. నంబి నారాయణ్ జీవితంలో ఎదుర్కొన్న మనసులు పిండేసే భావోద్వేగ బరితమైన సంఘటనలతో ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది. హీరో అర్.మాధవన్ దర్శకుడిగా మారి నిర్మించడంతో పాటు ప్రాణం పెట్టి నటించిన ఈ సినిమాలో తమిళ హీరో సూర్య,హిందీ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తమతమ భాషల్లో  అతిధి పాత్రలో నటించారు.

 

4.సుజల్ – ది ఓర్టెక్స్ (Suzhal: The Vortex 2022)

ఈ సీరీస్ రొటీన్ క్రైం థ్రిల్లర్లకు బిన్నంగా ప్రేక్షకులను ఆశ్చర్య పరిచే సన్నివేశాలతో తెరకెక్కింది. 8 ఎపిసోడ్లతో ఉండే ఈ సీరీస్ ప్రతి ఎపిసోడ్ దాదాపుగా 40 నిమిషాల నిడివితో ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిపోతుంది. విక్రమ్ వేదా సినిమా దర్శకులు పుష్కర్,గాయత్రి రచయితలుగా వ్యవహరించగా,బ్రహ్మా జీ,అనుచరన్ మురుగేయన్ ఈ సీరీస్ ను తెరకెక్కించారు.

 

5.డేజావు (Dejavu 2022)

ఇటీవలే కాలంలో వచ్చిన తమిళ సినిమాలకు భిన్నంగా అందర్నీ అబ్బురపరిచే కథతో తెరకెక్కిన సినిమా డేజావు. ఈ సినిమాలోని ట్విస్ట్ లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ సంగీత దర్శకుడు గిబ్రాన్ సినిమాను ఆకర్షింప చేసే విధానం సంగీతాన్ని సమకూర్చగా,దర్శకుడు అరవింద్ శ్రీనివాసన్ ఈ సినిమాను తెరకెక్కించారు.

What do you think?

టాప్ 5 నెట్ ఫ్లిక్స్ సీరీస్లు పార్ట్ #2

టాప్ 5 ప్రైమ్ వీడియో సినిమాలు,సీరీస్లు #పార్ట్ 2