in ,

ఆహా అనిపించే 5 ఉత్తమ ఆహా సినిమాలు #పార్ట్ 1

అలరిస్తూ ఆహా అనిపించే 5 ఉత్తమ ఆహా సినిమాలు

వినోదాన్ని పంచే,అలరించే ఓ.టి.టిలలో ఆహా ఒకటి. అలాంటి ఆహాలోని 10 ఉత్తమ సినిమాలు మీ కోసం.

1. డిజే టిల్లు

దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ డ్రామా డిజే టిల్లు. ఈ సినిమాలోని వినోదాత్మకమైన సన్నివేశాలు ప్రేక్షకులను కడపుబ్బా నవిస్తూ అలరిస్తాయి. సిద్దూ జొన్నలగడ్డ,నేహా శెట్టి ప్రధాన పాత్రలు పోషించగా,శ్రీ చరణ్ పాకాల,యస్.యస్ తమన్ సంగీతాన్ని అందించారు.

2.సేనాపతి

ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన క్రైం థ్రిల్లర్ డ్రామా సేనాపతి.
భావోద్వగబరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఆసక్తికరంగా సాగిపోతుంది ఈ చిత్రం. పవన్ సాధినేని దర్శకత్వం వహించగా,జ్ఞానేశ్వరీ కండ్రెగుల,పావనీ రెడ్డి,నరేష్ అగ్స్య ముఖ్య పాత్రలు పోషించారు.

3.మెయిల్

కొత్త దర్శకుడు ఉదయ్ గుర్రల తెరకెక్కించిన కామెడీ డ్రామా మెయిల్. ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ సాగిపోతాయి. ప్రియ దర్శి,గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించి అలరించారు.

4.కలర్ ఫోటో

నిజ జీవితనికి దగ్గరగా భావోద్వేగబరితమైన సన్నివేశాలతో రూపొందిన రొమాంటిక్ పీరియాడిక్ డ్రామా కలర్ ఫోటో. తనదైన కొత్తధనంతో,ఉత్కంఠబరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిత్రం. కాలభైరవ అందించిన సంగీతం చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చింది. సూహాస్,చాందినీ చౌదరి తమ పాత్రలలో జీవించి ఆకట్టుకోగా,సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు.

5.అశోకవనంలో అర్జున కళ్యాణం

వరుస సినిమాలతో అధరగొడుతున్న విశ్వక్ సేన్ ప్రేక్షకులను అలరించడంలో వెనకడుగువేయనని మరోసారి నిరూపించుకున్న చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం.రోమ్- కామ్ గా తెరకెక్కిన ఈ సినిమా అందర్నీ ఆలోచింప చేస్తూ,కడుపుబ్బ నవ్విస్తుంది. రుక్సర్ ధిల్లాన్, రితికా నాయక్, వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్ ప్రధాన పాత్రలు పోషింగా,యువ దర్శకుడు విద్యా సాగర్ చింత తెరకెక్కించారు.

What do you think?

2022 టాప్ 5 నెట్‌ఫ్లిక్స్ సిరీస్లు #పార్ట్ 1

రికార్డులను బద్దలుకొడుతున్న “రింగ్స్ ఆఫ్ పవర్”