in ,

బుర్ర కథ లోని సందర్భోచిత కథనం.. రచయితల కోసం

బుర్ర కథ లో వ్యక్తిత్వ వికాసం…

ప్రాచీన కళా రూపాలు మనిషిలో అంతర్గతంగా ఉన్న శక్తిని మేలు కొలిపి దిశా నిర్దేశనం చేస్తాయి. ఈ విషయాన్ని చాలా మంది గమనించరు. ఇందులో బుర్ర కథ ప్రక్రియ కూడా తన వంతు పాత్రను పోషిస్తోంది. వినాయక చవితి ఉత్సవాలు, దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పది రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో బుర్ర కథ ప్రదర్శన తప్పక ఉంటుంది.

ఇందులో హాస్య చతురత, మాటల విరుపులో అశ్లీలంలేని ద్వంద్వ అర్థాలు, నవ్వు పుట్టించే భావాలు ,తంబూరా శ్రుతి మేళవింపు, పక్క వాయిద్యంగా డోలు శబ్దం కలయికతో బుర్ర కథ నేటికీ ప్రజాదరణ పొందుతోంది. ఇందుకు ఉదాహరణ చూడండి. కథకుడు పురుష పాత్రధారిగా తన ప్రసంగాన్ని కొన సాగిస్తూ ” మీ ఆడాళ్ళు అలా ముందుకు వెళితే మేము ఇలా “మందు”కు వెళతాం అని చెప్పగానే ప్రేక్షకులు చప్పున నవ్వుతారు. ఆమె అతని వంక ఆశ్చర్యంగా చూస్తుంది.

 

ఆ వెంటనే అతడు “గబ్బర్ సింగ్” సినిమాలో కోటా శ్రీనివాసరావు పాడే
“మందు బాబులం..మేము మందు బాబులం” అనే పాటను హమ్ చేసి.. సరదాలను పంచుతాడు. ఇక్కడ గమనించాల్సిందే మేమిటంటే మందు,ముందు అనే మాటల ద్వారా ప్రాసను ప్రదర్శించారు. అందులో శ్లేషార్థం కూడా దాగి ఉంది.

మనం తెలుగు పాఠంలో చందస్సు వచ్చినప్పుడు ఇదేం తలపోటు అంటూ విసుక్కుంటాం. కాని అందులో ఎంతో, విజ్ఞానం, వికాసం ఉంటాయి. రచయిత గా ఎదగాలనే ఆలోచన ఉన్న వారికి బుర్ర కథ లోని సందర్భోచిత కథనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇదే బుర్ర కథలో కథానాయిక పాత్ర ధారి
“నేను ఎంసెట్ అంటుంది.

దానికి బదులుగా హీరో ” నేను థమ్స్ అప్” అని చెపుతాడు, అదేంటి అని అడగ్గా ” థమ్స్ అప్ యాడ్ లో మాదిరిగా బొటన వేలు చూపించి, దీన్ని వంచి వేస్తాం కదే …అదే వేలి ముద్ర” అంటాడు. ఈ సందర్భంలో వారిద్దరి భావాలు హాస్యాన్ని పంచి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులకు పాత్ర మవుతాయి. ఇలా మన చుట్టూ ఉన్న ఎన్నో విషయాలు మన వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి.

What do you think?

మంచిని పంచుతూ..మనిషికి సాయపడుతూ.. జీవించిన సౌందర్య

బ్రిటన్ మూడవ మహిళా ప్రధానిగా లిజ్ ట్రస్