in ,

ప్రభాస్ “ఆదిపురుష్” కోసం రాజమౌళి!

ప్రభాస్ “ఆదిపురుష్” కోసం రాజమౌళి!

ప్రస్తుతం ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమాలలో ముందు వరుసలో ఉండే సినిమా ప్రభాస్ “ఆదిపురుష్”. ఇప్పుడు ఈ సినిమా కోసం అగ్ర దర్శకుడు రాజమౌళి ఓ చెయ్యి వేయబోతున్నారట.
ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా “ఆదిపురుష్”.

 

అయితే ఈ సినిమా టీజర్ విషువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆసక్తికరంగా లేకపోవడంతో సినీ అభిమానులు, ప్రభాస్ అభిమానుల ఆసలు నీరుగారిపోయాయి. కానీ ఇటీవల విడుదలయిన ట్రైలర్ లో విషువల్ ఎఫెక్ట్స్ పర్లేదనిపించడం , అందులోని “జై శ్రీ రామ్” పాట అందర్నీ ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక వచ్చే నెల జూన్ 16న ఈ సినిమా విడుదల కాబోతున్న తరుణంలో చిత్రం బృందం ప్రమోషన్స్ కి సిద్ధమౌతుంది.

ఇదిలా ఉండగా మరో వైపు త్వరలో జరగబోతున్న “ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి “ఆస్కార్” అందుకుని అదరగొట్టిన అగ్ర దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవ్వబోతున్నారట. ప్రభాస్, రాజమౌళి మధ్య కూడా మంచి రిలేషన్ ఉండడంతో ఈ ఈవెంట్ కి ఆయన ఖచ్చితంగా అటెండ్ అవుతారని తెలుస్తుంది.

What do you think?

ఏపీ గ్రూప్1,గ్రూప్2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

కెనడాలో ఏపీ యువకుడు మిస్సింగ్!