in ,

30 ఇయర్స్ హాస్య నటుడు పృథ్వీరాజ్ కు అస్వస్థత.

హాస్య నటుడు పృథ్వీరాజ్ కు అస్వస్థత

 

30 ఇయర్స్ ఇండస్ట్రీగా (30 years industry) గుర్తింపు పొందిన హాస్య నటుడు పృథ్వీరాజ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

 

వివరాల్లోకి వెళ్తే ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న హాస్య నటుడు 30 పృథ్వీరాజ్ తన కూతురిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మొదటి సారి మెగా ఫోన్ పట్టారు. “కొత్త రంగుల ప్రపంచం” అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్న పృథ్వీరాజ్ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

 

ఇలాంటి సమయంలో ఆస్పత్రి బెడ్‌ మీదున్న పృథ్వీరాజ్ నుంచి ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ విడియోలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌గా తొలి ప్రయత్నం చేశాను. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నా. ‘కొత్త రంగుల ప్రపంచం’ సినిమాకి అందరి ఆశీస్సులు కావాలి’’ అని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

What do you think?

యాపిల్లో లేఆఫ్లు లాస్ట్ ఆప్షన్. కానీ…

ట్విట్టర్ లో కొత్త ఫీచర్లపై ఎలోన్ మస్క్ ట్వీట్..