“ఐశ్వర్యా నిన్ను నేను అర్థం చేసుకున్నాను” – రష్మిక
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్యా రాజేష్, “పుష్పలో నాకు ఛాన్స్ ఇచ్చుంటే రష్మిక కంటే బాగా నటించే దాన్ని” అంటూ చేసిన వ్యాఖ్యల గురించి అందరకీ తెలిసిందే. ఇక ఐశ్వర్యా రాజేష్ రష్మికను అలా అనలేదని, కొంత మంది తను మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారని ఇన్స్టా గ్రామ్ లో ఒక లేఖను పోస్ట్ కూడా చేసింది. అయితే తాజాగా ఈ వ్యవహారం పై ఇప్పుడు రష్మీక స్పందిస్తూ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ లో “మై లవ్.. నాకు ఇప్పటి వరకు ఈ విషయం గురించి తెలీదు. నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నువ్వు ఈ విషయంలో ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. అవి ఎప్పటికీ ఉంటాయి.” అంటూ రాష్మిక పేర్కొంది.
తాజాగా విడుదలైన ఐశ్వర్యా రాజేష్ ‘ఫర్హానా’ చిత్రం పై కూడా ఈ ట్వీట్ లో స్పందించిన రాష్మిక “నీ ‘ఫర్హానా’ చిత్రం చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్” అని ఐశ్వర్యా రాజేష్ ను ప్రశంసించింది.