in ,

వినోదాన్ని పంచే టాప్ 5 జీ-5 సినిమాలు #పార్ట్ 1…

వినోదాన్ని పంచే టాప్ 5 జీ-5 సినిమాలు

ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చిన వారిని అలరిస్తూ ఆనందింపచేసేవి ఓ.టి.టిలు. అలాంటి వినోదాన్ని పంచే 5 ఉత్తమ జీ-5 సినిమాలు మీ కోసం.

1.జెర్సీ

హీరో నాని,శ్రద్ధ శ్రీనాథ్ ప్రధాన పాత్రలలో నటించిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ. ఈ చిత్రంలో జరిగే సంఘటనలు నిజజీవితానికి దగ్గరగా ఉంటూ మనసుని హత్తుకుని కన్నీరు పెట్టిస్తాయి. మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిత్రం. యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ అందించిన స్వరాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

2.కాశ్మీర్ ఫైల్స్

కాశ్మీర్లో జరిగిన యధార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని కల్పిత కథతో తెరకెక్కించిన చిత్రం కాశ్మీర్ ఫైల్స్. ఈ చిత్రం భావోద్వేగబరితమైన సన్నివేశాలతో పాటు, ఉత్కంఠ కలిగించే విధంగా ఉంటుంది. అత్యంత వివాదాస్పదమైన ఈ చిత్రాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించగా,మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి,చిన్మయ్ మాండ్లేకర్, మృణాల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించారు.

3..కుధా అఫిజ్ చాప్టర్ -2

కుధా అఫిజ్ చాప్టర్ 1 కు సీక్వెల్ గా యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం కుధా అఫిజ్ చాప్టర్ -2 అగ్ని పరీక్ష. బలమైన కథతో వెంట్రుకలు నిక్కబొడుచుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిత్రం. ఫరూక్ కభీర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, విద్యుత్ జమాల్,మేనకా రాయి,ఫరాభి ఎమ్డి రిఫత్,షీబా చడ్డ ప్రధాన పాత్రలు పోషించారు.

4.రాజ రాజ చోర

విభిన్నమైన కథలతో వచ్చి ఎల్లపుడూ అలరించే శ్రీ విష్ణు నటించిన క్రైం కామెడీ డ్రామా రాజ రాజ చోర. ఈ చిత్రంలోని సన్నివేశాలు అలరిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. సునైన,మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించగా,యువ దర్శకుడు హసిత్ గోలి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

5.రిపబ్లిక్

దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. ఈ చిత్రం నిజజీవితానికి దగ్గర ఉంటూ భావోద్వేగబరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.సాయి ధరమ్ తేజ్,ఐశ్వర్య రాజేష్,రమ్యకృష్ణ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

What do you think?

2022 టాప్ 5 హాట్ స్టార్ సీరీస్లు,సినిమాలు పార్ట్#1

అవిశ్రాంత జనసేన సేవకుడు… బొమ్మిడి నాయకర్