in ,

టాప్ 5 నెట్ ఫ్లిక్స్ సినిమాలు పార్ట్ #1

టాప్ 5 నెట్ ఫ్లిక్స్ సినిమాలు

ఆసక్తికరమైన సినిమాలు ఓ.టి.టిలలో ఎన్నో ఉన్నాయి. అలాంటి వినోదాన్ని పంచే, మిమ్మల్ని మెప్పించే నెట్ ఫ్లిక్స్ లోని టాప్ 5 సినిమాలను ఈ రోజు మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ అబ్బురపరిచే సినిమాలను చూడండి, చూసి ఆనందించండి.

  1. అరైవల్ (Arrival 2016)

సైన్స్ ఫిక్షన్ డ్రామాగా కొత్త కథతో తెరకెక్కిన సినిమా అరైవల్. అబ్బురపరిచే సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తూ

ఆలోచించేలా చేస్తుంది.

 

  1. డోంట్ లుక్ అప్ (Don’t Look Up 2021)

లియోనార్డో డి కాప్రియో,జెన్నిఫర్ లారెన్స్ ప్రధాన పాత్రలలో నటించిన అపోకలిప్ట్ పోలిటికల్ సెటైరికల్ కామెడీ డోంట్ లుక్ అప్. ఈ సినిమా నిజ జీవితానికి అద్దం పట్టేలా బయట జరిగే సంఘటనలకు దగ్గరగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తుంది.

 

3.మిన్నల్ మురళి (Minnal Murali 2021)

సూపర్ హీరో యాక్షన్ డ్రామాగా రూపొందిన మలయాళం సినిమా మున్నల్ మురళి. ఈ సినిమా ఆసక్తికర సన్నివేశాలతో,తనదైన కొత్తదనంతో ప్రేక్షకులను అలరిస్తుంది. దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించగా,టొవినో తోమస్,ఫెమిన జార్జ్,గురు సోమసుందరం,షెల్లీ నబు కుమార్ తదితరులు ప్రథాన పాత్రలు పోషించారు.

 

4.ఎక్స్ ట్రాక్షన్ (Extraction 2020)

హాలీవుడ్ నటుడు క్రిస్ హెంస్వర్త్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎక్స్ ట్రాక్షన్. అబ్బురపరిచే సన్నివేశాలతో ప్రతి క్షణం ఆసక్తికరంగా సాగిపోతుంది ఈ సినిమా. ప్రముఖ దర్శకులు జో రుస్సో,అంతోనీ రుస్సో ఈ సినిమాను తెరకెక్కించారు.

 

5.మేజర్ (Major 2022)

మేజర్ సందీప్ ఉన్నికృష్నన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా మేజర్. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల మనసులకు హత్తుకుంటూ కన్నీరు పెట్టేలా చేస్తుంది. దర్శకుడు శశి కిరణ్ తిక్క మేజర్ సందీప్ తన జీవితంలో ఎదుర్కున్న సంఘటనలను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు శ్రీ చరణ్  పకల అందించిన స్వరాలు మేజర్ సినిమాకు మరింత బల్లని చేకూర్చాయి. హీరో అడవి శేష్,సాయే మంజ్రేకర్,సోబిత దులిపాల,రేవతి,ప్రకాష్ రాజ్,మురళి శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

What do you think?

స్మృతి “పదం” అల్లూరి సినిమాలో “శ్రీ శ్రీ” త(ఒ)ప్పు

టాప్ 5 నెట్ ఫ్లిక్స్ సీరీస్లు పార్ట్ 1……