in ,

త్రివిక్రమ్ దర్శత్వంలో ప్రభాస్ ? ఇది నిజమేనా?!

త్రివిక్రమ్ దర్శత్వంలో ప్రభాస్ ? ఇది నిజమేనా?!

పాన్ ఇండియా హీరో రెబెల్ స్టార్ ప్రభాస్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్ననారట. వీరి కలయికలో ఇప్పటి వరకు రాని తరహా సినిమా రాబోతోందట.

ప్రస్తుతం ఇటు మహేష్‌బాబుతో నిర్మిస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ28’ మూవీతో త్రివిక్రమ్, అటు ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘పోజెక్ట్ కే’, ‘రాజాడీలక్స్’, ‘స్పిరిట్’ మూవీలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు.

ప్రభాస్ నటిస్తున్న సినిమాలు చాలా వరకు ఈ ఏడాది, వచ్చే ఏడాది లలో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ‘ఆదిపురుష్’ అతి త్వరలో అంటే జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రివిక్రమ్ మహేష్‌బాబుతో తీస్తున్న సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి రాబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.వీరి కలయికలో ఇప్పటి వరకు రాని తరహాలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తుంది. అందులోనూ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు సైన్ చేస్తుండడంతో ఇది నిజమే అయ్యుంటుందని అభిమానులు నమ్ముతున్నారు.

ఇది వట్టి పుకారు కింద మిగిలిపోతుందో, లేక నిజంగానే పట్టాలెక్కి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందో చూడాలి మరి.

What do you think?

ఎంసెట్ పరీక్షలో ప్రసవించిన విద్యార్థిని!

ఇంత క్రూరత్వమా? రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు!