ఎంసెట్ పరీక్షలో ప్రసవించిన విద్యార్థిని!
ఓ విద్యార్థిని ఎంసెట్ పరీక్ష రాయడానికి వెళ్లిన క్యాంపస్ లోనే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డను ఎండలో వదిలి వెళ్లడంతో ఆ పసికందు మృతి చెందింది.
వివరాల్లోకి వెళ్తే విజయవాడ శివారులోని పెనమలూరులోని ఓ ఎగ్జాం సెంటర్ కి ఎంసెట్ పరీక్ష రాయడానికి వచ్చిన 17 ఏళ్ల వద్యార్డినికి క్యాంపస్ ఆవరణలోనే పురిటి నొప్పులు రావడంతో తోటి విద్యార్థుల సహాయంతో ప్రసవించింది.
అనంతరం పసికందును ఎండలో వదిలేసి పరీక్ష రాయడానికి
లోపలికి వెళ్లింది. దీంతో ఎండలో ఉన్న ఆ పసికందు మృతి చెందింది. యువతిని పరీక్ష పూర్తయ్యాక ఆసుపత్రికి తీసుకెళ్లారు.
తల్లిదండ్రులు విడిపోగా యువతి తల్లితో పాటు ఉంటూ స్థానికంగా ఓ షోరూంలో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.