in

ఇంత క్రూరత్వమా? రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు!

ఇంత క్రూరత్వమా? రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు!

నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అక్కడి ప్రజలకు చిన్న విషయాలకు కూడా ఊహకు అందని శిక్షలు విదిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ పై విడుదలైన ఓ నివేదిక సంచలనంగా మారింది. అతడి క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో మరో సారి ప్రపంచానికి తెలిసేలా చేసింది.

అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఉత్తరకొరియా ప్రభుత్వం అక్కడి ప్రజల పై పాల్పడుతున్న దారుణాలను వెల్లడించింది.

ఇతర మతాల వారి పట్ల కిమ్‌ ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తోందని తెలిపింది. ఇప్పటివరకు అక్కడ దాదాపు 70 వేల మంది క్రైస్తవులను జైలుకు పంపినట్లు నివేదిక పేర్కొంది.
ఇదంతా ఒకెత్తయితే ఇందులో ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలపడంతో ఇప్పుడు అంతర్జాతీయంగా ఇది ఒక సంచలనంగా మారింది.

2009 లో మత గ్రంథాన్ని కలిగి ఉండటం, మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో ఓ కుటుంబంతో పాటు ఆ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ నివేదిక వెల్లడించింది.

దీంతో ఈ విషయం సంచలనంగా ఇప్పుడు మారింది. కిమ్ జోంగ్ ఉన్ క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో మరో సారి ప్రపంచానికి తెలిసేలా చేసింది.

What do you think?

త్రివిక్రమ్ దర్శత్వంలో ప్రభాస్ ? ఇది నిజమేనా?!

అలరించని ‘శాకుంతలం’ కి అంతర్జాతీయ అవార్డులు!