in ,

జస్టిన్ ట్రూడోపై విమర్శలు గుప్పించిన ఎలోన్ మస్క్

జస్టిన్ ట్రూడోపై విమర్శలు గుప్పించిన ఎలాన్ మస్క్

జస్టిన్ ట్రూడోపై ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని అణచివేస్తున్నారని మండి పడ్డారు.

విషయం ఏంటంటే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కంపెనీలు ప్రభుత్వం వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

కాగా ఈ విషయంపై ఓ జర్నలిస్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ప్రపంచ అపర కుబేరుడు ఎలోన్ మస్క్ దానికి స్పందించారు. కెనడాలో వాక్ స్వేచ్ఛను (freedom of speech) అణచి వేసేందుకే ట్రూడో ఇటు వంటి నిబంధనలు పెడుతున్నారని ఎలోన్ విమర్శించారు. ఇలా చేయడం సిగ్గు చేటని అంటూ టుడ్రో పై మస్క్ విమర్శలు గుప్పించారు.

What do you think?

వైద్యశాస్త్రంలో కరికో, వెయిస్ లకు నోబెల్‌ ప్రైజ్

కేసీఆర్ పై మోదీ సంచలన వ్యాఖ్యలు. ప్రజలు మెచ్చిన వారే..