in ,

“రంగం” హిరోయిన్, రాధ కుమార్తె కార్తిక వివాహం

“రంగం” హిరోయిన్, రాధ కుమార్తె కార్తిక వివాహం

“జోష్” సినిమాతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన అమ్మాయి కార్తిక (karthika). అలనాటి నటి రాధ కుమార్తె అయిన కార్తిక 2011 లో విడుదలైన “రంగం” సినిమాతో మొదటి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత పలు తెలుగు, తమిళ్ , మలయాళ భాషల్లోనూ నటించార. తెలుగులో “దమ్ము”, “బ్రదర్ ఆఫ్ బొమ్మాళి” వంటి సినిమాలలో ప్రధాన పోషించారు. 2015 నుంచి వెండి తెరకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె ఇటీవల మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రోహిత్ మేనన్ తో ఆమె ఏడడుగులు వేశారు.

ఆదివారం ఉదయం కేరళలో వీరి వివాహం వేడుకగా జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు చిరంజీవి – సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని, రేవతి.. తదితరులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

What do you think?

అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.70లక్షల బంగారం స్వాధీనం

పెంపుడు కుక్కలకు అంతుచిక్కని వ్యాధి