in ,

అలరించే నాలుగు మంచి సినిమాలు మీ కోసం!

అలరించే నాలుగు మంచి సినిమాలు మీ కోసం!

అలసిపోయి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అలసటను మరచిపోడానికి ఓ మంచి సినిమా చూడాలని, చూసి మైమరచిపోవాలని కోరుకుంటారు. కానీ అలా మైమరపించే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ రోజు అలాంటి అరుదైన ఓ నాలుగు సినిమాలను మీ కోసం తీసుకొచ్చాం. మరింకెందుకు ఆలస్యం?! ఈ సినిమాలను వెంటనే చూసేయండి, చూసి ఆనందించండి.

1. పలానా అబ్బాయి పలానా అమ్మాయి

ఇది ఇటీవల విడుదలైన ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ. అయితే ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు కానీ దీనిలో చాలా సినిమాలలో మిస్స్ అయ్యే సోల్ కనిపిస్తుంది. ఆ సోల్ మనల్ని ఆ ప్రపంచంలోకి మనకు తెలియకుండానే తీసుకు వెళ్ళిపోతుంది. ప్రథాన పాత్రలు, ఆ సినిమాలోని ప్రపంచం నిజ జీవితాన్ని చాలా బాగా ప్రతిబింబిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాను చూస్తున్నంత సేపు అందులో మనమే ఉన్నట్టు అనిపిస్తుంది. కళ్యాణ్ మాలిక్ అందించిన సంగీతం సినిమాకు మరింత బలం అందించిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి పాట పదే పదే వినాలి అనిపిస్తుంది. ఇక శ్రీనివాస్ అవసరాల అయితే ఈ సినిమాను తను అనుకున్నట్టు ప్రేక్షకులకు చూపించడంలో వంద శాతం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ప్రధాన పాత్రలో నటించిన నాగ శౌర్య, మాలవిక నాయర్లు ఆ పాత్రలలో ఒదిగి పోయారు.

2. బర్నింగ్

ఈ సినిమా ఓ కొరియన్ థ్రిల్లర్ డ్రామా. అయితే ఇది చాలా వరకు వచ్చే థ్రిల్లర్ సినిమాల లాగా ట్విస్ట్ల మీద ట్విస్ట్ల తో వేగంగా సాగిపోదు. ఇది ఓ స్లో పాయిజన్ సినిమా. ఓ సైకలాజికల్ థ్రిల్లర్. చాలా వరకు థ్రిల్లర్ సినిమాలలో ప్రతి విషయాన్ని వివరిస్తారు. కానీ ఈ సినిమాలో మనకు ప్రతి విషయం తెలిసేటట్లు చూపిస్తారు. సినిమాను దానిలో ఫీల్ ను మనలోకి నెమ్మదిగా ఎక్కిస్తారు. అందుకే ఈ సినిమాను కళ్ళతో చూడడంతో పాటు మనసుతో ఫీల్  కూడా అవుతారు.

3. ఐ సా ది డెవిల్

ఇది కూడా ఓ కొరియన్ థ్రిల్లర్ డ్రామానే. ఈ సినిమా ప్రేక్షకులను స్క్రీన్ నుంచి తల తిప్పనివ్వదు. అంత ఉత్కంఠతతో సాగుతుంది. దీనిలో ఓ సైకో అమ్మాయిల్ని చంపుతూ ఉంటాడు. అలా ఓ రోజు హీరోకు ప్రాణమైన అమ్మాయిని కూడా చంపుతాడు. హీరో ఆ సైకోను కొంత సేపటికే కనిపెట్టేస్తాడు. కానీ చంపడు. ఆ సైకోను వెంటాడి వేటాడి చావంటే ఏంటో చూపిస్తుంటాడు. అలా వీరిద్దరు మధ్య కాట్ అండ్ మౌస్ గేమ్ మొదలువుతుంది.

4. పంచతంత్రం

ఈ సినిమా ఇటీవల వచ్చిన మంచి సినిమాలలో ఒకటని చెప్పొచ్చు. ఇది ఓ యాంతోలజీ. ఈ సినిమాలో అయిదు విభిన్నమైన కథలుంటాయి. వాటికి ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు. కానీ ప్రతి కథ మన మనసుల్ని కదిలిస్తుంది. సినిమా పూర్తయ్యే సరికి మనకి ఒక మంచి సినిమా చూశామనే అనుభూతిని ఇస్తుంది.

What do you think?

పెన్షన్ కోసం తల్లి మృతదేహాన్ని దాచి పెట్టిన కొడుకు

ఒక ప్రమాదం మరువక ముందే మరో ప్రమాదం. రైలు కింద నలిగి..