in ,

ఒక టికెట్ కి ఇంకో టికెట్. “ది వ్యాక్సిన్ వార్”..

ఒక టికెట్ కి ఇంకో టికెట్ . “ది వ్యాక్సిన్ వార్”..

“ది వ్యాక్సిన్ వార్” (the vaccine war) చిత్ర బృందం సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ సినిమాకు ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అని ప్రకటించింది.

“ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాతో దేశాన్ని ఒక ఊపు ఊపిన దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఇప్పుడు మరో సారి అదే రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో “ది వ్యాక్సిన్ వార్” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని వ్యాక్సిన్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్తల గురించి చాటి చెప్పే కథాంశంతో ఈ “ది వ్యాక్సిన్ వార్” సినిమా తెరకెక్కింది. దీంట్లో నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, సప్తమి గౌడ, రైమా సేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమా ఇటీవల సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా సినీ ప్రియులకు ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్ర బృందం ఆఫర్ ఇచ్చింది. ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ఆది, సోమవారం మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలిపింది.

టికెట్లను బుక్ మై షో, పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వెబ్సైట్లు/యాప్ ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని కోరింది.

What do you think?

19,024 అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఫ్యాషన్ షో. ఇది ప్రపంచ రికార్డు..

వైద్యశాస్త్రంలో కరికో, వెయిస్ లకు నోబెల్‌ ప్రైజ్