in

19,024 అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఫ్యాషన్ షో. ఇది ప్రపంచ రికార్డు..

19,024 అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఫ్యాషన్ షో. ఇది ప్రపంచ రికార్డు..

19,024 అడుగుల ఎత్తైన ప్రదేశంలో అంతర్జాతీయ ఫ్యాషన్ షో జరిగింది. ఈ షోను లద్దాఖ్ లో నిర్వహించారు.

వివరాల్లోకి వెళ్తే వైబ్రంట్ లద్దాఖ్ ఉత్సవాల్లో భాగంగా గురువారం అంతర్జాతీయ ఫ్యాషన్ షో జరగ్గింది. ఈ ఫ్యాషన్ షోను 19,024 అడుగుల ఎత్తైన ప్రదేశంలో నిర్వహించడంతో ప్రపంచ రికార్డు నమోదైంది.

లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంత అధికార యంత్రాంగం, లద్దాఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్ సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి. భారతీయ సైన్యం, సరిహద్దు భద్రతా దళం షో సాఫీగా జరగడానికి సహకరించాయి. కాగా అంతర్జాతీయ మోడళ్లతో పాటు ఇద్దరు లద్దాఖ్ మోడళ్లు కూడా ఇందులో పాల్గొనడం విశేషం.

What do you think?

సోషల్ మీడియా ద్వారా రూ.854 కోట్ల స్కాం చేసిన సైబర్ కేటుగాళ్లు

ఒక టికెట్ కి ఇంకో టికెట్. “ది వ్యాక్సిన్ వార్”..