in

సోషల్ మీడియా ద్వారా రూ.854 కోట్ల స్కాం చేసిన సైబర్ కేటుగాళ్లు

సోషల్ మీడియా ద్వారా రూ.854 కోట్ల స్కాం చేసిన సైబర్ కేటుగాళ్లు

దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయని రోజూ వింటూనే ఉంటాం. కానీ దానికి ఎవరు ఎప్పుడు ఎలా బలి అవుతారో ఊహించలేం. తాజాగా ఇప్పుడు కూడా కొందరు కేటుగాళ్లు భారీ ఆన్‌లైన్ మోసానికి పాల్పడ్డారు. సోషల్ మీడియా ద్వారా ఏకంగా రూ.854 కోట్లను కొల్లగొట్టారు.

రూ.1000 నుంచి రూ.10 వేల వరకు పెట్టుబడి పెడితే రోజుకు రూ.5 వేలు వరకు లాభం పొందొచ్చని కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వారి మీద ప్రజల్లో నమ్మకం పెంచడానికి పెట్టు బడులు పెట్టిన వారికి లాభాలు కూడా చూపించారు. దీంతో అందరూ గొర్రెల మందల్లా వాళ్ళు చెప్పిన దానికి తల ఊపి లక్షల్లో పెట్టుపడులు పెట్టారు. అయితే ఈ సారి వారు వెచ్చించిన డబ్బుకి లాభాలు రాకపోగా తమ డబ్బులు కూడా విత్‌డ్రా కాలేదు. దీంతో అంతా అయిపోయినాక మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

సోషల్ మీడియా ద్వారా ఆ కేటుగాళ్లు ఏకంగా రూ.854 కోట్లను దోచుకున్నారని తెలుసుకున్న పొలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

What do you think?

పవన్ ‘వారాహీ’ యాత్రకు పూర్తి మద్దతు ఇస్తున్నాం – బాలకృష్ణ

19,024 అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఫ్యాషన్ షో. ఇది ప్రపంచ రికార్డు..