in ,

“సనాతన ధర్మంపై మాట్లాడటం ఆపే ప్రసక్తే లేదు” – ఉదయనిది స్టాలిన్

“సనాతన ధర్మంపై మాట్లాడటం ఆపే ప్రసక్తే లేదు” – ఉదయనిది స్టాలిన్

ఇంతకు ముందు తమిళనాడు సీఎం తనయుడు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యల ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గక ముందే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై మరో సారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై గతంలో పెరియార్, అంబేద్కర్ సహా ఎందరో మాట్లాడారని, మణిపూర్ సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఈ అంశంపై దృష్టి పెట్టిందని అన్నారు. అయినా సరే తాను మాట్లాడుతూనే ఉంటానని, సనాతన ధర్మంపై మాట్లాడటం ఆపే ప్రసక్తే లేదని ఉదయనిధి స్టాలిన్ తేల్చిచెప్పారు.

What do you think?

“బాలికల విద్యకు అయ్యే ఖర్చు ప్రభుత్వానిదే” – సీఎం శివరాజ్

“జవాన్” ఓటీటీలోకి వచ్చేస్తోంది.స్ట్రీమింగ్ అప్పుడే