in

36 గంటల పాటు సముద్రంలో తేలి చావును ఎదిరించాడు.

36 గంటల పాటు సముద్రంలో తేలి చావును ఎదిరించాడు.

సముద్రంలో కొట్టుకుపోయిన 13 ఏళ్ల ఓ యువకుడు మృత్యువును జయించాడు. చెక్కను పట్టుకుని 36 గంటల పాటు సముద్రంలో తేలుతూ ఉన్నాడు.

వివరాల్లోకి వెళ్తే గుజరాత్‌లోని సూరత్ కు చెందిన 13 ఏళ్ల లఖన్ దేవిపూజక్ గణేష్ నిమజ్జన సమయంలో ఈత కొట్టడానికి తన సోదరుడితో కలిసి సముద్రంలోకి దూకాడు. అయితే ఆ సమయంలో లఖన్ సోదరుడు సముద్రంలో కొట్టుకుపోగా అక్కడున్న వారు తనని రక్షించారు. కానీ అదే సమయంలో లఖన్ కొట్టుకుపోయి కనిపించకుండా పోయాడు.

తన కోసం గంటలు తరబడి ఎంత మంది వెతికినా అతని జాడ తెలియలేదు. ఇక ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో 36 గంటల తరువాత లఖన్ కనిపించాడని, అతన్ని సురక్షితంగా కాపాడామని మత్స్యకారులు తెలిపారు. అతను కొట్టుకుపోయే సమయంలో గణేషుడి విగ్రహానికి ఉండే ప్లైవుడ్ చెక్కను పట్టుకోవడంతో 36 గంటల పాటు సురక్షితంగా దాని మీదే ఉన్నాడు. అలా దాని సహాయంతో చావును ఎదిరించి బయటపడ్డాడు.

What do you think?

త్రివిక్రమ్-మెగాస్టార్ కాంబో? ‘ఖైదీ’ సీక్వెల్..

“జీవితంలో అనుకున్న వెంటనే ఏది జరగదు”- రోహిత్ శర్మ