in ,

వీకెండ్ ప్లాన్స్ లేవా..? అయితే ఈ సినిమాలు చూసేయండి

వీకెండ్ ప్లాన్స్ లేవా..? అయితే ఈ సినిమాలు చూసేయండి

1. భావేష్ జోషి – సూపర్ హీరో (bhavesh joshi super hero)

భావేష్ , సికిందర్ లు ఇన్సాఫ్ టీవీ (insaaf tv) అనే యూట్యూబ్ ఛానెల్ ను పెట్టి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దాంట్లో దానికి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తుంటారు. కానీ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల సికిందర్ ఇన్సాఫ్ టీవీని వదిలేసి వెళ్లిపోతాడు. ఆ తరువాత భావేష్ ఒక నీటి మాఫియా గురించి ప్రజలకు తెలిపే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో భావేష్ పెద్ద సమస్యలో ఇరుకుంటాడు.

ఆ తరువాత ఏం జరిగింది? భావేష్ సమస్య నుంచి బయట పడ్డాడా? సికిందర్, భావేష్ మళ్ళీ కలిశారా? అన్నది మిగతా కథ.

2. జోజి (joji)

ఇంజనీరింగ్ డ్రాపౌట్ అయిన జోజి (ఫాహద్ ఫాసిల్) ఎన్నారై కావాలనే ఆకాంక్షలతో తన పెద్ద ఉమ్మడి కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. కానీ తన తండ్రి జోజి ని ఎందుకూ పనికి రాని వాడిలా లెక్క గట్టి తక్కువగా చూస్తుంటాడు.

స్థాయికి మించిన ఆశలతో, కుటుంబాన్ని కూడా లెక్క చెయ్యని జోజి, అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో జోజి తండ్రికి పక్షవాతం వస్తుంది. ఆ ఒక్క ఘటనతో జోజి ఎప్పుడూ అడ్డనుకునే తండ్రి మూల పడిపోవడంతో కన్నింగ్ ప్లాన్స్ (cunning plans) తో తను కోరుకున్నది దక్కించుకునే ఆట మొదలు పెడతాడు.

ఆ తరువాత ఏమైంది? జోజి అనుకున్నది సాధించాడా? తన కుంటుంబాన్ని ఎలా ఎదిరించాడు? తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

3. బ్రేవ్ హార్ట్ (Brave heart)

విలియం వాలెస్ (william Wallace) ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకున్న తన ప్రేయసి ముర్రోన్ (murron) ను ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ I (England king edward I) సైనికులలో కొంతమంది క్రూరంగా చంపేస్తారు.
ఆ ఘటనతో తన ప్రాణం లాంటి ప్రేయసిని కోల్పోయిన విలియమ్, ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ I క్రూరమైన పాలను ఎదిరించి, అతని రూల్ ను అంతం చేయాలని తిరుగుబాటు (rebellion) మొదలు పెడతాడు.

ఆ తరువాత ఏం జరిగింది? విలియం కింగ్ ఎడ్వర్డ్ I ఓడించాడా? తన లక్ష్యాన్ని చేరాడా? అన్నది మిగతా కథ.

4. కావలుదారి (kavaludhari)

ట్రాఫిక్ పోలీస్ అయిన శ్యామ్ క్రైమ్ కు సంభందించిన కేసులను సాల్వ్ చేయాలనే ఇంట్రెస్ట్ (interest) తో క్రైమ్ బ్రాంచ్ లోకి మారాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో ఓ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో రోడ్డును తొవ్వుతుండగా అనుకోకుండా మానవ ఎముకల బయట పడతాయి. ఆ ఎముకలు 40 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ కుటుంబానివని పోలీసులకి తెలుస్తుంది. ఇది క్రైం బ్రాంచ్ లోకి మారడానికి మంచి అవకాశం అని భావించిన శ్యామ్ 40 ఏళ్ళ క్రితం జరిగిన ఈ కేసును ఎలాగైనా సాల్వ్ చేయాలని డిసైడ్ అవుతాడు.

ఆ తరువాత ఏం జరిగింది? శ్యామ్ ఆ కాసును సాల్వ్ చేశాడా? తను కోరుకున్న విధంగా క్రైం బ్రాంచ్ లోకి మారడా? అన్నది మిగతా కథ.

5. ది ట్రూమాన్ షో ( the truman show)

ట్రూమాన్ బర్ బ్యాంక్ (Truman burbank) అనే ఓ ఇన్సూరెన్స్ సేల్స్ మ్యాన్ (insurence salesman) అందరిలాగే మామూలు జీవితం జీవిస్తుంటాడు. కానీ అనుకోకుండా ఓ రోజు తను సిల్వియా అనే ఓ అమ్మాయిని కలుస్తాడు. ఆ సమయంలో సిల్వియా ట్రూమాన్ కు తను ఓ సిములేషన్ (simulation) ఉన్నాడని, తన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని రికార్డ్ చేస్తున్నారని, తను ఒక టీవీ షో లో పాత్రని, తను చూసేదేది నిజం కాదని చెబుతుంది. ఆ మాటలతో ట్రూమాన్ కన్ఫ్యూజన్ (confusion) లో పడతాడు. తన జీవితం మీద అనుమాన పడడం మొదలు పెడతాడు.

ఆ తరువాత జరిగింది? ట్రూమాన్ నిజంగానే సిములేషన్ లో ఉన్నాడా..? అక్కడి నుంచి తప్పించుకున్నాడా? లేక ఆమె అబద్దం చెబుతోందా..? తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

What do you think?

‘అనారోగ్యం పేరుతో చంద్రబాబును చంపే ప్రయత్నం జరుగుతుంది’ -లోకేష్

ఆ గ్రామంలో ఉండేది 11 మందే.. ఓట్లు ఉన్నది ఐదుగురికే