in ,

‘నా రెడీ’ పాట వల్ల దళపతి విజయ్ పై కేసు నమోదు.

‘నా రెడీ’ పాట వల్ల దళపతి విజయ్ పై కేసు నమోదు.

 

తమిళ్ స్టార్ హీరో విజయ్‌పై కేసు నమోదైంది. ఆయన కొత్త సినిమా ‘లియో’ చిత్రబృందం పై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

వివరాల్లోకి వెళ్తే దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దళపతి విజయ్ హీరోగా ‘లియో’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 19న విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ‘నా రెడీ’ అనే పాట ఇటీవలే విడుదల కాగా ఈ సాంగ్‌లో ప్రతీ సీన్‌లోనూ విజయ్ నోట్లో సిగరెట్ పెట్టుకుని కనిపించాడు. దీంతో ఈ విషయం పై చెన్నైకు చెందిన సోషల్ యాక్టివిస్ట్ ఆర్టీ సెల్వం కోర్టును ఆశ్రయించాడు. సినిమాలో విజయ్ సిగరెట్ తాగడం ఏమాత్రం బాగోలేదని చెబుతూ.. హీరో విజయ్‌, చిత్రబృందంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు.

ఐతే ఈ విషయం పై చిత్రబృందం ఇంకా స్పందించాల్సి ఉంది.

What do you think?

జర్నలిస్ట్స్ అందరికీ ఇళ్ల స్థలాలిస్తాం – కేటీఆర్

గొడ్డళ్లతో దాడి చేసుకున్న రైతులు.భూ వివాదమే కారణం!