in ,

ప్రేక్షకులకు సారీ చెప్పిన ‘బేబీ’ సినిమా దర్శకుడు

ప్రేక్షకులకు సారీ చెప్పిన ‘బేబీ’ సినిమా దర్శకుడు

విజయ్ దేవర కొండ సోదరుడు ఆనంద్ దేవర కొండ ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన ‘బేబీ’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిన విషయమే. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతోంది. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు సాయి రాజేష్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. అటువంటి డైలాగ్స్ ఉన్నా సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

విషయం ఏంటంటే ‘బేబీ’ సినిమాలో కొన్ని అభ్యంతరకర పదాలు ఉన్నాయి. ఈ విషయం పై తాజాగా దర్శకుడు సాయి రాజేష్ స్పందించారు. “హీరో హీరోయినల మధ్య స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండటంతో అభ్యంతరకర పదాలు వాడాల్సి వచ్చింది. ‘తెరవాల్సింది కళ్లు కాదు..’ అనే డైలాగు, ఆ పదాలు రాయాల్సింది కాదు. మిగతా డైలాగ్స్ అన్నీకథకు అవసరమైనవే. అయినా ప్రేక్షకులు ఇవేమీ పట్టించుకోకుండా సినిమాను ఆస్వాదిస్తున్నారు.’’ అంటూ సాయి రాజేష్ చెప్పుకొచ్చారు. అటువంటి తనను డైలాగ్స్ ఉపయోగించినందుకు క్షమించమని ప్రేక్షకులను కోరారు.

What do you think?

గిన్నిస్ బుక్ రికార్డు కోసం కంటి చూపు కోల్పోయాడు

చిన్నారికి రూ.6.5 కోట్లు చెల్లించిన మెక్డొనాల్డ్స్