in ,

హలో ఫిల్మీ పీపుల్ జర భద్రం !మాటలు నమ్మారంటే అంతే..

హలో ఫిల్మీ పీపుల్ – జర భద్రం !

 

ఈ మద్య సినిమాలెలా ఉన్నా.. హీరోలు, మేకర్స్ సినిమాలను వారి మాటలతో అమ్మేస్తున్నారు.

“ప్రమోషన్” పేరులోనే ఉంది – మన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోటం. ఉన్నదాన్ని పదింతలు చేసి చెప్పుకోడం. దీంట్లో ఎం తప్పులేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ప్రోడక్ట్ ను పొగుడు కుంటారు, సినిమా కూడా దానికి అతీతం కాదు. ఆడియన్స్ థియేటర్ కు రావాలి. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ ఇలా అనేక ఫీట్స్ చేస్తారు. మంచి కథ, హీరో అదరగొట్టాడు, డైరెక్టర్ మనసు పెట్టి చేసాడు. థియేటర్స్ మోతమోగుతాయి, ఇలాంటి అనేక మాటలతో షో నడిపిస్తారు. నిజానికి సినిమాలో కన్నా సోషల్ మీడియా, టీవీ ఛానల్ ఇంటర్వూస్ లో కథానాయకులు మరింత రక్తి కట్టిస్తారు.

రాజకీయ నాయకులకి మాటలే ప్రధాన ఇన్వెస్ట్మెంట్. పాలిటిక్స్ ఎంట్రీ కి మొదటి అర్హత. ఎంత బాగా మాయ మాటలు చెబితే అంత మైలేజి లభిస్తుంది. రానున్న ఐదేళ్ల వరకు వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని తెలిసినా మనేమేం చేయలేము. వెయిట్ చేయాల్సిందే. కానీ ఫిల్మీ పీపుల్ అబద్దం చెబితే మొదటి షో కె ఆడియన్స్ రివెంజ్ తీర్చుకుంటారు.

సరిగ్గా లైగర్ పరిస్థితి అదే. సోషల్ మీడియా ట్రోలింగ్ కి కారణం. రిలీజ్ కు ముందు పూరి, ఛార్మి, విజయదేవరకొండ చెప్పిన మాయ మాటలే. అవి అబద్ధాలు కావు, ప్రమోషన్ లో ఒక భాగం కావచ్చు. అంటే ఇది మాయే.
“లై ” గర్ అంటే మాయమాటలు చెప్పేవాడు అని కొత్త భావం వచ్చింది. ముగ్గురు లైగర్ లు కలిసి సినిమాను సాగనంపేసారు.

సాధారణం గ హీరో, డైరెక్టర్ వంటి వాళ్ళు సినిమాల విషయం లో మరింత అనుభవం ఉన్నవాళ్లే, వాళ్ళకి సినిమా ఫస్ట్ కాపీ చూడగానే పరిస్థితి తెలిసిపోతుంది. మాములు ఆడియన్స్ కే ఫస్ట్ షో చూసినపుడు జాతకం అంచనా వేసేస్తారు. అలాంటిది ప్రొఫెషనల్స్ కి ఆమాత్రం తెలియకుండా ఉంటుందా? తెలీదు అంటే వాళ్ళేదో లోకం లో ఉన్నట్లే.

తెలిసి కూడా దీనికి మించింది లేదు అని హైప్ కి తీసుకెళ్లారు. ఎందుకంటే మొదటి మూడు రోజులైనా టికెట్లు తెగితే నాలుగు పైసలొస్తాయని. దీనిని కూడా క్షమించేయొచ్చు. ఎందుకంటే వ్యాపారం లో ఇదోక పార్ట్ కాబట్టి. అయితే మేటర్ లేకుండా ఓవర్ హైప్ చేస్తారే, వాళ్లది మాత్రం పక్కా మోసం. లైగర్ లో అదే శృతిమించింది..

199 కోట్ల పై నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుందని హీరో, ఓ టీ టీ 195 కోట్లకు అడిగితే ఇవ్వలేదని చార్మీ, తాను అద్భుతం తీశానని పూరీ ఊరూరూ తిరిగి చెబుతూ వుంటే జనం నిజమని నమ్మారు. థియేటర్లో కూచున్న వెంటనే దిమ్మ తిరిగి మూతీ, ముక్కు పగిలిపోయాయి. బయటికొచ్చి తిట్టడం స్టార్ట్ చేశారు. ఆ కడుపు మంటతో నెగటివ్ టాక్ మాట్లాడుతున్న వాళ్ళని అక్కడక్కడా హీరో అభిమానులు అడ్డుకున్నారు.
ప్రేక్షకులని తక్కువ అంచనా వేయలేం. తీసే వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఆడియన్స్ కి వివేకం, విచక్షణా ఇంకా ఉన్నాయ్. అందుకే ఆంధ్ర లో హిట్ అయినా సినిమా విదేశాల్లో కూడా ఆడుతుంది. మనుషలందరి లో ఎమోషన్స్ ఉంటాయి. వాటిని టచ్ చేయగలిగితే సినిమా హిట్. లేదంటే ఫట్.

నిజం ఏంటంటే సినిమా బాగుంటే ఎన్ని నెగెటివ్ రివ్యూలు వచ్చినా దాని విజయాన్ని ఆపలేరు. పసలేని సినిమాని పాజిటివ్ రివ్యూలతో బతికించలేరు. అయినా సినిమా బాగుంటే చెడుగా మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంటుంది. మాట్లాడినా ఎవరూ పట్టించుకోరు. విషయం వుండడం వల్లే బింబిసార, సీతారామం, కార్తికేయ -2 సైలెంట్ గ దుమ్ము రేపాయి. ఫస్ట్ డే కిటకిటలాడే జనం లేరు. అయినా రాకెట్ ల దూసుకుపోయాయి.

మీరు ఎంత ఖర్చుపెట్టయినా సినిమా తీయండి. దాని గురించి గొప్పగా చెప్పుకోండి. కానీ తెరమీద ఏదో అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నామని, తెలిసీ అబద్దం చెప్పకండి. ఒక్కసారి ఆడియన్స్ కి మీ మీద నమ్మకం పోతే మళ్ళి జీవితం లో నమ్మరు గాక నమ్మరు. పూరీ, విజయ్ తర్వాతి సినిమాలకి ఎన్ని చెప్పినా జనం ఆచితూచి థియేటర్ వైపు అడుగులు వేస్తారు అనేది నిజం.

దర్శకులు, హీరోల్లో కొంచెం కూడా ఫెయిర్నెస్ లేకపోతే అది తెర మీద మాత్రం ఎక్కడ నుంచి వస్తుంది
సో…
హలో ఫిల్మీ పీపుల్ – జర భద్రం !

What do you think?

కుప్పకూలిన యుద్ధ విమానం. స్పాట్లో ముగ్గురు మృతి.

మన మనిషి.. మంచిమనిషి …ఎమ్మెల్యే కేతిరెడ్డి