అలరించని ‘శాకుంతలం’ కి అంతర్జాతీయ అవార్డులు!
ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేక దియేటర్ ముందు చతికిల పడిన సినిమా ‘శాకుంతలం’. ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా ఈ సినిమా సీరియల్ ల ఉందని, ట్రైలర్ అంత బాగోలేదని రకరకాల విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇలా ప్రతి దశలోనూ ప్రేక్షకులను నిరాశ పరుస్తూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అంతర్జాతీయంగా అవార్డులు అందుకుని అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘శాకుంతలం’ ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ ఇండియన్ ఫిల్మ్, బెస్ట్ ఫారెన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌కు గాను అవార్డులు సాధించింది.
ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయిన ఈ సినిమా ఇలా అవార్డులు అందుకుని అదరగొడుతుండడంతో అందరూ ఆశ్చర్య పోతుండగా.. నటి సమంత సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా.. గుణశేఖర్ దర్శకత్వం వహించారు.