in ,

సినిమాలు చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు

సినిమాలు చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.

ఓ వ్యక్తి సినిమాలు చూసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. రోజుకు 3 సినిమాలు చూసి ఈ ఘనత సాధించాడు.

వివరాల్లోకి వెళ్తే అమెరికాకు చెందిన 32 ఏళ్ల జాక్ స్వోప్ అనే వ్యక్తి మే 2022 నుంచి మే 2023 వరకు రోజుకు కనీసం 3 సినిమాలు చూశాడు. ఓ వైపు జాబ్ చేస్తూనే ఆఫీస్ అయ్యాక సినిమాలు చూసేవాడు. అలా ఏడాదిలో ఏకంగా 777 సినిమాలు చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఒక ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు చూసిన వ్యక్తిగా నిలిచాడు.

కాగా గతంలో ఈ రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ క్రోన్ (715 సినిమాలు) పేరిట ఉండగా.. ఇప్పుడు తాజాగా జాక్ స్వోప్ 777 సినిమాలు చూసి ఆ రికార్డును బద్దలు కొట్టాడు.

What do you think?

వెనుకబడిన వర్గాలకు రూ.లక్ష సాయం. అప్లై చేసుకోండిలా

తెలుగు మిస్టరీ స్టోరీ వర్ణ – చాప్టర్ 2 – విక్రమ్