in ,

నిజజీవిత కథల ఆధారంగా తెరకెక్కిన టాప్ 5 సినిమాలు

మనసును కదిలించే 5 నిజజీవిత కథల ఆధారంగా తెరకెక్కిన టాప్ 5 సినిమాలు (Top 5 Biopics)

 

ఇటీవలే కాలంలో ఎక్కువగా తెరకెక్కించినవి ప్రముఖుల జీవిత కథలే. అలా ప్రపంచ అభివృద్ధికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణమైన కొంతమంది వ్యక్తుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు మీ కోసం.

 

1.రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ (Prime Video & Voot)

పద్మ భూషణ్ గ్రహీత,ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేసిన యస్.నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రి. నంబి నారాయణ్ జీవితంలో ఎదుర్కొన్న భావోద్వేగబరితమైన సంఘటనలతో ఈ సినిమా ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది. హీరో అర్.మాధవన్ దర్శకుడిగా మారి నిర్మించడంతో పాటు ప్రాణం పెట్టి నటించిన ఈ సినిమాలో తమిళ హీరో సూర్య,హిందీ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తమతమ భాషల్లో అతిధి పాత్రలో నటించారు.

 

  1. మహనటి ( Prime Video)

మాయాబజార్,దేవదాసు,మిస్సమ్మ లాంటి ఎన్నో మరపురాని సినిమాలలో నటించిన గొప్ప  నటి సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. సావిత్రి గారి పాత్రలలో కీర్తి సురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్,విజయ్ దేవర కొండ,సమంత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించడం ద్వారా అగ్ర దర్శకుడి స్థాయికి చేరుకున్నాడు.

 

3.ఇంటు ది వైల్డ్ (Prime Video)

అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ మెక్ కాండ్లేస్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అడ్వెంచర్ డ్రామా ఇంటు ది వైల్డ్. ఈ సినిమాకు సీన్ పెన్ దర్శకత్వం వహించగా,ఎమిలే హిర్చ్,క్రిస్టిన్ స్టీవర్ట్ ప్రధాన పాత్రలలో నటించారు.

 

4.సర్దార్ ఉధం (Prime Video)

భారతదేశ విప్లవ కారుడు సర్దార్ ఉధం సింగ్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో  జరిగిన జలిన్ వాలా బాగ్ మారణకాండ ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా సర్దార్ ఉధం. ఈ సినిమాలో  విక్కీ కౌశల్,బానిత సందు ప్రధాన పాత్రలు పోషించగా,సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించారు.

 

5.షేర్షా (Prime Video)

భారతదేశ సైనికుడు కెప్టెన్ విక్రమ్ బత్ర జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ వార్ డ్రామా షేర్షా. ఈ సినిమాలో జరిగే భావోద్వేగబరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తాయి. హీరో,హీరోయిన్ల మధ్య జరిగే సంఘటనలు ప్రేక్షకులను అలరిస్తాయి. దర్శకుడు విష్ణువర్ధన్ ఈ సినిమాను తెరకెక్కించగా,సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ, శివ్‌ పండిట్‌, నిఖిత్‌ ధీర్, హిమాన్షో, అనిల్‌ చరణ్‌జీత్‌ ప్రథాన పాత్రలు పోషించారు.

What do you think?

టాప్ 5 ప్రైమ్ వీడియో సీరీస్లు #పార్ట్ 2

టాప్ 5 మూవీస్ ఆఫ్ డిస్నీ హాట్‌స్టార్ #పార్ట్ 1