in ,

టాప్ 5 మూవీస్ ఆఫ్ సోనీలివ్ పార్ట్#1

టాప్ 5 మూవీస్ ఆఫ్ సోనీలివ్ 

 

1.సత్య(తెలుగు) : రామ్ గోపాల్ వర్మ దర్శక,నిర్మాతగా సౌరభ్ శుక్లా మరియు అనురాగ్ కశ్యప్ రచించిన క్రైమ్ ఫిల్మ్ ‘సత్య’. ఇందులో J. D. చక్రవర్తి, ఊర్మిళ మటోండ్కర్, మనోజ్ బాజ్‌పేయి, ముఖ్య తారాగణం. రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్స్టర్ ప్లాట్ తో తీసిన మూవీస్ లో ఇదే మొదటిది. రూ.2.5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ.15 కోట్లు వసూల్ చేసి అప్పట్లో బిగ్గెస్ట్ సెన్సేషన్ గా నిలిచింది. ఈ సినిమాకి 6 ఫిలింఫేర్ అవార్డులు మరియు ఒక నేషనల్ అవార్డు రావటం గమనార్హం.

 

2.డార్క్ వాటర్స్ : ఈ చిత్రాన్ని నథానియల్ రిచ్ రచించిన న్యూ యార్క్ టైమ్స్ మ్యాగజైన్ ఆర్టికల్ “ది లాయర్ హూ బికేమ్ డుపాంట్’స్ వరస్ట్ నైట్మేర్” ఆధారంగా రూపొందించారు. లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ తో క్రమంగా స్క్రీన్స్ పెంచుకుంటూ మంచి హిట్ గా నిలిచింది.

 

3.జెర్సీ(హిందీ) : గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’. గౌతమ్ ఇదే కథ ని తెలుగులో నాని తో తీసి క్లాసికల్ హిట్ స్కోర్ చేసారు. ఆ తరువాత ఆ స్టోరీ ని హిందీ లో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసారు. బి టౌన్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఎమోషన్స్ తో అన్ని వర్గాల వారిని అలరిచింది. నాని మరియు షాహిద్ ఇద్దరి కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.

 

4.1917 : సామ్ మెండెస్ దర్శక,నిర్మాత గా వార్ ఫిల్మ్ ‘1917’.మెండెస్ కు అయన గ్రాండ్ ఫాదర్ ‘ఆల్ఫ్రెడ్’ వరల్డ్ వార్-1 లో ఆయన సర్వీస్ గురించి చెప్పిన కధనాల ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది. కమర్షియల్ గా ఈ సినిమా హిట్ కాకపోయినా 92వ అకాడమీ అవార్డ్స్‌లో పది నామినేషన్లను అందుకొని దానిలో ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కి అవార్డ్స్ గెలుచుకుంది.

 

5.పికు(హిందీ) : దీపికా పదుకోనే,అమితాబ్ బచ్చన్,ఇర్ఫాన్ ఖాన్ లాంటి స్టార్ కాస్ట్ తో షూజిత్ సిర్కార్ తెరకెక్కించిన కామెడీ-డ్రామా పీకు. పికూ అనే బెంగాలీ షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తీసిన ఈ సినిమా కథ,స్క్రీన్ ప్లే,కామెడీ,నటీనటుల సహజ నటనతో అందర్నీ ఆకట్టుకుని కాసుల వర్షం కురిపించింది.ఈ సినిమాకి దీపికా పదుకొణె ఉత్తమ నటిగా రెండవ ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది మరియు అమితాబ్ బచ్చన్ 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడిగా నాల్గవ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు మరియు అతని నటనకు ఉత్తమ నటుడిగా మూడవ ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకున్నారు.

What do you think?

టాప్ 5 మూవీస్ ఆఫ్ డిస్నీ హాట్‌స్టార్ #పార్ట్ 2

టాప్ 5 హాట్ స్టార్ సీరిస్లు #పార్ట్ 1…