in ,

బాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న “బేబి”

బాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న “బేబి”

హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో, నటి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన “బేబి” సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అటు థియేటర్ లోనూ, ఇటు ఓటీటీలోనూ రికార్డులు సృష్టించి ప్రేక్షకుల ఆదరణ పొందింది.

అయితే తాజాగా ఈ సినిమా తమిళ్ లో డబ్బింగ్ అయ్యి, హిందీలో రీమేక్ అయ్యి అక్కడ ఆయా భాషల్లో విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే హిందీ రీమేక్ పై మేకర్స్ ఇటీవల క్లారిటీ కూడా ఇచ్చేశారు.

కాగా గతంలో విజయ్ దేవరకొండకు స్టార్డం (stardom ) తెచ్చిన “అర్జున్ రెడ్డి” హిందీలో భారీ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు అదే భాటలో అడుగులు వేస్తూ విజయ్ తమ్ముడు ఆనంద్ నటించిన ఈ “బేబీ” సినిమా కూడా అక్కడ రీమేక్ కాబోతోంది. మరి ఈ సినిమా అక్కడ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.

What do you think?

‘గేమ్ ఛేంజర్‌’ పాట లీక్ చేసిన నిందితులు అరెస్ట్

రష్మికా డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన కేంద్రం