in ,

ప్రైమ్ వీడియోలోని టాప్ 5 సినిమాలు # పార్ట్ 1

ప్రైమ్ వీడియోలోని టాప్ 5 సినిమాలు 

అందరికీ నచ్చే,మంచి వినోదాన్ని పంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలోని 5 ఉత్తమ సినిమాలు మీ కోసం.

1.ఇంటర్స్టెల్లర్ (Interstellar 2014)

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నొలన్ తెరకెక్కించిన మైండ్ బెండింగ్ సినిమాల్లో ఒకటి ఇంటర్స్టెల్లర్. సైన్స్ ఫిక్షన్ స్పేస్ అడ్వెంచర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ ఒక కొత్త అనుభూతిని కలిగించింది. సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక సారైన ఈ సినిమాని చూడాల్సిందే.

2.ఇన్సెప్షన్ (Inception 2010)

దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మరో అద్బుతం ఇన్సెప్షన్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఇన్సెప్షన్ సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాలోని సన్నివేశాలు ప్రతి క్షణం ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ అలరిస్థాయి.హాలీవుడ్ ప్రముఖ నటుడు లియోనార్డో డికాప్రియో,సిలియన్ మర్ఫీ,టామ్ హార్డీ ప్రధాన పాత్రలలో నటించారు.

3.జైభీం (Jai Bhim 2021)

నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా జై భీమ్. పీరియాడిక్ లీగల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మనసును కదిలించే భావోద్వేగాలతో ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది. జ్ఞానవెలు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా,హీరో సూర్య ప్రధాన పాత్ర పోషించారు.

4.పారాసైట్ (Parasite 2019)

ఆస్కార్ ను గెలుచుకున్న సౌత్ కొరియన్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ పారాసైట్. ఈ సినిమాలోని సన్నివేశాలు ధనిక, పేద మధ్య ఉండే వ్యత్యాసాలను చూపించే కామెడీ థ్రిల్లర్. దర్శకుడు బొంగ్ జూన్ – హో ఈ సినిమాను తెరకెక్కించారు.

5.ది వేలింగ్ (The Wailing 2016)

సౌత్ కొరియన్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా ది వేలింగ్. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఆసక్తికరంగా సాగిపోతుంది.

What do you think?

అలరించే తెలుగు వెబ్ సీరీస్లు….!

2022 టాప్ 5 నెట్‌ఫ్లిక్స్ సిరీస్లు #పార్ట్ 1