in ,

అలరించే తెలుగు వెబ్ సీరీస్లు….!

అలరించే తెలుగు వెబ్ సీరీస్లు

ఓ.టి.టి లో సినిమాలకు,సీరీస్ లకు కొదవలేదు. కానీ వాటిలో మంచి సీరీస్లు రావటం చాలా అరుదు. అలాంటి అరుదైన ప్రేక్షకులని అలరించే 3 తెలుగు వెబ్ సిరీస్లు మీ కోసం.

1.గాలివాన (ఓ.టి.టి : జీ5)

కథ: చిన్నప్పట్నుంచీ ప్రేమించుకుంటున్న అజయ్-గీత పెద్దలను వప్పించి పెళ్లి చేసుకుంటారు. అజయ్-గీత హనీమూన్ కోసం వైజాగ్ వెళ్లగా అక్కడ ఒక దొంగ వాళ్ళని చంపి నగలను తీసుకుని పారిపోతాడు. అనుకోని పరిస్థితులలో ఆ దొంగా గాయపడి అజయ్-గీతల ఇంటికి చేరతాడు. వాడిని కోలుకునేలా చేసి పోలీసులకు అప్పగించాలని కుటుంబ సభ్యులు అనుకుంటారు. కానీ వారిలో ఒకరు ఆ దొంగను చంపేస్తారు. అసలు అజయ్-గీతాలను ఎందుకు చంపారు? ఆ దొంగా కుటుంబ సభ్యుల దగ్గరకు ఎందుకు వచ్చాడు? వీటికి సమాధానం తెలియాలంటే గాలివాన చూడాల్సిందే.

క్రైం డ్రామాగా వచ్చిన గాలివాన విడుదలైన కొన్ని రోజులకే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన కొత్త ధనంతో అందర్ని అలరింపా చేసింది. సాయికుమార్,రాధిక శరత్ కుమార్,శ్రీ లక్ష్మి,తాగుబోతు రమేష్,కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలలో నటించారు.దర్శకుడు శరణ్ కొప్పిసెట్టి తెరకెక్కించగా,చంద్ర పెమ్మరాజు కథను సమకూర్చారు.

 

2.ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ (ఓ.టి.టి : జీ5)

కథ : హరి దాస్,రుక్మిణిల కొడుకు మహేశ్. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇంట్లోనే కాలిగా ఉంటాడు. కూర్చోపెట్టి జీతం ఇచ్చే ఉద్యోగం కోసం చూస్తుంటాడు. వారి వీధిలో నివసించే కీర్తిని మొదటి చూపులోనే ఇష్టపడతాడు. మహేశ్ నాన్న హరిదాసు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా 25 లక్షలు అప్పుచేస్తాడు. కానీ ఆ తరువాత హఠాత్తుగా హరి దాసు చనిపోతాడు. నెల నెలా వాయిదా కట్టమని బ్యాంక్ వాళ్ళు మహేశ్ ఇంటిపై పడతారు. అప్పటివరకు ఆనందంగా సాగిపోయిన మహేశ్ జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. హరి దాస్ అంత అప్పు ఎందుకు చేశాడు? మహేశ్ ఆ అప్పుని తీర్చాడా? వీటికి సమాధానం తెలియాలంటే ఒక్క చిన్న ఫ్యామిలీ స్టొరీ చూడాల్సిందే.

కామెడీ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ సీరీస్ లో సంగీత్ సోబన్,సిమ్రాన్ శర్మ,నరేష్,తులసి,రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలలో నటించగా,దర్శకుడు మహేశ్ ఉప్పల తెరకెక్కించాడు.

 

3.నవంబర్ స్టొరీ (డిస్నీ + హాట్ స్టార్)

కథ:ఎథికల్ హ్యాకింగ్ చేసే అనురాధ పాత ఫైల్స్ ని డిజిటల్ చేసేందుకు పోలీసులకు సహాయం చేస్తుంటుంది. తన తండ్రి గణేష్ క్రైం నవల రచయిత. ఆమె తండ్రి మతి మరపుకు కారణమయ్యే అల్సైమర్స్ తో బాధపడుతుంతాడు. అనుకోని సందర్భంలో గణేష్ ఒక మహిళ చనిపోయే సమయంలో అక్కడే కత్తి పట్టుకుని ఉంటాడు. గణేష్ ఆ మహిళను హత్య చేశాడా?ఆ మహిళ ఎవరు? ఇవి తెలియాలంటే నవంబర్ స్టొరీ చూడాల్సిందే. క్రైం డ్రామాగా తెరకెక్కిన ఈ సీరీస్ లో తమ్మన,జీ.ఎమ్.కుమార్,పసుపతి,నమిత కృష్ణమూర్తి ప్రధాన పాత్రాలలో నటించగా,దర్శకుడు ఇంద్రా సుబ్రహ్మణ్యున్ తెరకెక్కించాడు.

ఇలాంటి మంచి సీరీస్లు ఓ.టి.టి లో చాలానే ఉన్నాయి, వాటిని వెతికి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, ధన్యవాదాలు.

What do you think?

టాప్ 5 హాట్ స్టార్ సీరిస్లు #పార్ట్ 2…

ప్రైమ్ వీడియోలోని టాప్ 5 సినిమాలు # పార్ట్ 1