in ,

టాప్ 5 ప్రైమ్ వీడియో(prime) సీరీస్లు #పార్ట్ 1

టాప్ 5 ప్రైమ్ వీడియో సీరీస్లు 

ఓ.టి.టిలలో ఎప్పటికప్పుడు కొత్త సీరీస్లు వస్తూనే ఉంటాయి. అలా విడుదలైన ప్రతి సీరీస్ వేటికవి విభిన్నంగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తుంటయి.అలాంటి వినోదాన్ని పంచే ప్రైమ్ వీడియోలోని ఉత్తమ సీరీస్లు మీ కోసం.

 

1.మెంటలిస్ట్ (The Mentalist 2008)

క్రైం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా 2008లో టీవీలో ప్రసారమైన మెంటలిస్ట్ చివరిగా 7 సీజన్స్ తో 2015లో ముగిసింది. ఈ సీరీస్ లోని హీరో వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకునే విధంగా,ఆసక్తికరంగా ఉంటుంది. హాలీవుడ్ నటినటులు సైమన్ బేకర్,రాబిన్ టున్నే, అమాండా రిగ్గేటి,టిమ్ కాంగ్,ఓవేన్ యోమన్ ప్రధాన పాత్రలు పోషించగా,దర్శకుడు క్రిస్ లాంగ్ ఈ సీరీస్ ను తెరకెక్కించారు.

 

2.ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 (The Family Man 2019)

ప్రముఖ హిందీ నటుడు మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నటించిన సీరీస్ ఫ్యామిలీ మ్యాన్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరీస్ ప్రతి క్షణం ప్రేక్షకులని కట్టిపడేస్తూ ఉత్కంఠ బరితంగా సాగిపోతుంది. దర్శకులు రాజ్&డి.కే లు ఫ్యామిలీ మ్యాన్ ను తెరకెక్కించగా,ప్రియమణి,శరీబ్ హష్మీ,ఆశ్లేష తాకుర్,వేదాంత్ సిన్హా ముఖ్య పాత్రలు పోషించారు.

3.ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 (The Family Man 2021)

ఫ్యామిలీ మ్యాన్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ సీరీస్ లో హీరోయిన్ సమంత తొలిసారి ప్రతినాయిక పాత్రలో కనిపిస్తూ మనోజ్ బాజ్పేయికి ధీటుగా నటించింది. ఈ రెండోవ సీజన్లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉండగా ప్రతిక్షణం తరువాత ఎం జరుగుతుందో అని ప్రేక్షకులను ఎదురు చూసేలా చేస్తుంది. మొదటి సీజన్ ను తెరకెక్కించిన రాజ్-డి.కే లు ఈ సీజన్ కి కూడా దర్శకులుగా వ్యవహరించారు. ప్రియమణి,శరీబ్ హష్మీ,ఆశ్లేష తాకుర్,వేదాంత్ సిన్హా,హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

 

4.వాంపైర్ డైరీస్ (The Vampire Diaries 2009)

వాంపైర్ ల ఆధారంగా తెరకెక్కిన ఈ అమెరికన్ సీరీస్ విభిన్నమైన కథతో ఆసక్తికరంగా సాగిపోతుంది. మొత్తం 8 సీజన్లుగా తెరకెక్కిన ఈ సీరీస్ ప్రతి సీజన్ లో తనదైన కొత్తధనాన్ని కనపరుస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. హాలీవుడ్ కి చెందిన పాల్ వెస్లీ,నినా డొబ్రేవ్,ఇయన్ సోమర్ హల్డర్, కాండిస్ కింగ్,మాథ్యూ డెవిస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

 

5.మోడ్రన్ లవ్ ముంబై  (Modern Love Mumbai 2022)

అమెరికన్ సీరీస్ మోడ్రన్ లవ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సీరీస్ 6 విభిన్నమైన కథలతో తనదైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీరీస్ ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుంది. అర్షడ్ వాసి, చిత్రాంగద సింగ్, నసీరుద్దీన్ షా,తనూజ,యహాసాస్ చన్న,అదర్ మాలిక్ ప్రధాన పాత్రలలో నటించగా,దర్శకుడు నుపుర్ ఆస్థాన ఈ సీరీస్ ను తెరకెక్కించారు.

What do you think?

టాప్ 5 ప్రైమ్ వీడియో సినిమాలు,సీరీస్లు #పార్ట్ 2

వందే భారత్ జింకను ఢీకొట్టడంతో వ్యక్తి మరణం!