in ,

ఆహా అనిపించే 5 ఉత్తమ ఆహా సినిమాలు #పార్ట్ 2

అలరిస్తూ ఆహా అనిపించే 5 ఉత్తమ ఆహా సినిమాలు

 

1.నాంది

బలమైన కథతో,అబ్బురపరిచే సన్నివేశాలతో రూపొందిన క్రైం కోర్టు రూం డ్రామా నాంది. నిజ జీవితానికి దగ్గరగా ఉంటూ ప్రతి క్షణం ఉత్కంఠతో భావోద్వేగబరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను కన్నీరు ప్పెట్టిస్తుంది ఈ సినిమా. దర్శకుడు విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని తెరకెక్కించగా,అల్లరి నరేష్,నవమి గాయక్ ప్రధాన పాత్రల్లో నటించారు.

2.మాలిక్

ప్రముఖ నటుడు ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మాలిక్. ఈ చిత్రం మొదటి నుంచి చివరి వరకు ఉత్కంటబరితంగా తరువాత ఏం జరుగుతుందో అనే విధంగా సాగిపోతుంది. దర్శకుడు మహేష్ నారాయణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

3.భానుమతి రామకృష్ణ

తనదైన కొత్త ధనంతో అలరించే సన్నివేశాలతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా బానుమతి రామ కృష్ణ. నవీన్ చంద్ర,సలోని లూత్ర ప్రధాన పాత్రలు పోషించగా,శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

4.సూపర్ డీలక్స్

అబ్బురపరిచే సన్నివేశాలతో రూపొందిన డార్క్ కామెడీ డ్రామా సూపర్ డీలక్స్. ఈ చిత్రంలోని ప్రతి క్షణం ఆసక్తికరంగా ప్రేక్షకులను అలరిస్తూ సాగిపోతుంది. విజయ్ సేతుపతి,సమంతా, ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించగా,త్యాగరాజన్ కుమార రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

5.రాజా వారు రాణి గారు

రొమాంటిక్ డ్రామాగా రూపొందిన వినోదాత్మక చిత్రం రాజా వారు రాణి గారు.ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ అలరిస్తాయి. యువ దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా,కిరణ్ అబ్బవరం,రహస్య గోరక్ ప్రధాన పాత్రలు పోషించారు.

What do you think?

రికార్డులను బద్దలుకొడుతున్న “రింగ్స్ ఆఫ్ పవర్”

2022 టాప్ 5 హాట్ స్టార్ సీరీస్లు,సినిమాలు పార్ట్#1