in ,

రికార్డులను బద్దలుకొడుతున్న “రింగ్స్ ఆఫ్ పవర్”

రికార్డులను బద్దలుకొడుతున్న “రింగ్స్ ఆఫ్ పవర్”

లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఈ పేరు వినని వారుండరు అని అనడం అతిశయోక్తి కాదేమో. బ్రిటీష్ దేశస్థుడైన ఆంగ్ల రచయిత జె.ఆర్.ఆర్ టోల్కిన్ 1954వ సంవత్సరంలో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే నవలను ప్రచురించారు. ఆ తరువాత సంవత్సరంలో “లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది టు టవర్స్”,”లార్డ్ ఆఫ్ ది రింగ్స్: రిటర్న్ ఆఫ్ ది కింగ్” నవలల్ను కొనసాగింపుగా ప్రచురించగా, ఆ నవలలకు ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో ఆదరణ లభించింది. వాటిని ఆధారంగా చేసుకుని దర్శకుడు పీటర్ జాక్సన్ 2001లో “లార్డ్ ఆఫ్ ది రింగ్స్:ది ఫెల్లోషిప్ ఆఫ్ ది రింగ్” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆపై ఈ సీరీస్ లోని మిగిలిన రెండు నవలల్ని కూడా చిత్రాలుగా తెరకెక్కించారు.

అలా చిత్రాలుగా తెరకెక్కించిన ప్రతి సారి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలను సృష్టించాయి. ఈ సీరీస్ లోని మొదటి చిత్రం ఇంటర్ నెట్ అంటే అంతగా తెలియని కాలంలోనే అత్యంత వేగంగా 24 గంటల్లో 1.7మిలియన్ల డౌన్లోడ్లు పొందిన ట్రైలర్ గా ఘనత సాధించింది. ఆపై ఈ చిత్రాలలో 2,00,000 పాత్రలతో జరిగిన అతి పెద్ద యుద్ధ సన్నివేశాలుండటంతో ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టి ఇప్పటి వరకు ఏ చిత్రానికి దక్కని ఘనతను దక్కించుకుంది. ఈ చిత్రాల జీవిత కాలంలో 800 అవార్డులకు ఎంపికవ్వగా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 475 అవార్డులను అందుకుంది.

అటువంటి అద్భుతాలు సృష్టించిన ఈ సిరీస్ ఇప్పుడు ఓ.టి.టిలో “లార్డ్ ఆఫ్ ది రింగ్స్:రింగ్స్ ఆఫ్ పవర్” సీరీస్ రూపంలో విడుదలయ్యి మరొకసారి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

సెప్టెంబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో “లార్డ్ ఆఫ్ ది రింగ్స్”కు ప్రీక్వెల్ గా విడుదలైన “రింగ్స్ ఆఫ్ పవర్” మళ్లీ రికార్డులను బద్దలుకొడుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటివరకు ఏ సీరీస్ పొందని ఆదరణను పొందటంతో పాటు విడుదలైన 24గంటల్లోనే 25 మిలియన్ల వీక్షకులను చేరి రికార్డ్ని సృష్టించింది.

What do you think?

ఆహా అనిపించే 5 ఉత్తమ ఆహా సినిమాలు #పార్ట్ 1

ఆహా అనిపించే 5 ఉత్తమ ఆహా సినిమాలు #పార్ట్ 2