in ,

విక్రమ్ ఆ మాటలు నవ్వుతూ అన్నారు – “తంగలాన్” టీమ్

విక్రమ్ ఆ మాటలు నవ్వుతూ అన్నారు – “తంగలాన్” టీమ్

వైరల్ అవుతున్న చియాన్ విక్రమ్ చేసిన వ్యాఖ్యలు పై “తంగలాన్” మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. విక్రమ్ ఆ మాటలు నవ్వుతూ అన్నారని తెలిపింది.

విషయం ఏంటంటే తమిళ డైరెక్టర్ పారంజిత్ చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కించిన “తంగలాన్” సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఈ “తంగలాన్” సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నాకు డైలాగ్స్ లేవు. ఇది “శివపుత్రుడు” తరహాలో ఉండబోతోంది. మీ అందరికీ కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది.” అని అన్నారు. దీంతో “తంగలాన్” లో తనకు డైలాగ్స్ లేవన్న మాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని మీద రకరకాల ఆర్టికల్స్ వెబ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో “తంగలాన్” మూవీ టీమ్ ఈ విషయంపై స్పందించక తప్పలేదు. విక్రమ్ మాట్లాడింది టీజర్ ని ఉద్దేసించని, టీజర్ లో ఆయన డైలాగ్స్ లేవన్న విషయాన్నే ఆయన చెప్పారని తెలిపింది. సినిమాలో ఆయనకు డైలాగ్స్ పుష్కలంగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది.

What do you think?

ఈ నెలాఖరులోగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల – ఏపీ ప్రభుత్వం

మోత మోగిస్తున్న ఉల్లి ధర.శుభవార్త చెప్పిన కేంద్రం