in ,

2022 టాప్ 5 హాట్ స్టార్ సీరీస్లు,సినిమాలు పార్ట్#1

2022 టాప్ 5 హాట్ స్టార్ సీరీస్లు,సినిమాలు 

ఎల్లపుడూ వినోదాన్ని పంచే హాట్ స్టార్ లో 2022లో విడుదలైన టాప్ 5 విభిన్నమైన సినిమాలు,సీరీస్ లు మీకోసం.

1.విక్రమ్ (Vikram)

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా విక్రమ్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బారి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతి సన్నివేశానికి వెంట్రుకలు నిక్క బొడుచుకునే విధంగా దర్శకుడు లోకేష్ కనగ రాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు. హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

2.మసూమ్ (Masoom)

థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరీస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. చివరి వరకు సినిమాలోని తీవ్రతను నిలుపుకుంటూ ఆసక్తికరంగా సాగిపోతుంది. సీజన్ 1గా విడుదలైన ఈ సీరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండగా ఒక్కొకటి 30 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. దర్శకుడు మిహిర్ దేశాయ్ తెరకెక్కించారు.

3.హెవెన్ (Heaven)

క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మలయాళం సినిమాలో ప్రతి సన్నివేశం ఆసక్తిగా సాగిపోతుంది. ప్రతి క్షణం ఉత్కంఠబరితంగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఉన్ని గోవింద రాజు ఈ సినిమాను తెరకెక్కించారు.

4.ది అన్ టోల్డ్ (The Untold)

హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ నిడివి కేవలం 15 నిమిషాలే అయినప్పటికీ ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తూ సాగిపోతుంది. ఆస్ట్రేలియాకు చెందిన రొన్ ఖోలోన్ ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు.

5.కడవర్ (Cadaver)

క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రతి సన్నివేశంలో ఆసక్తి కలిగిస్తూ వినోధాన్ని పంచుతుంది. ముందు నుంచి చివరి వరకు తనదైన కొత్తదనాన్ని కనపరుస్తుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అనూప్ పనిక్కర్ తెరకెక్కించగా,అమలా పాల్,హరీష్ ఉత్తమన్ ప్రధాన పాత్రలలో నటించారు.

What do you think?

ఆహా అనిపించే 5 ఉత్తమ ఆహా సినిమాలు #పార్ట్ 2

వినోదాన్ని పంచే టాప్ 5 జీ-5 సినిమాలు #పార్ట్ 1…