టాలీవుడ్ ఇండస్ట్రీకి పైరసీ వెబ్సైట్ స్ట్రాంగ్ వార్నింగ్!
సినీ ఇండస్ట్రీ లో ఎప్పటికీ పరిష్కారం దొరకని సమస్య పైరసీ. సినీ నిర్మాతలు, సినీ ఇండస్ట్రీ ఎంత ప్రయత్నించి ఆ పైరసీ వెబ్సైట్లను ఆపినా, అవే వెబ్సైట్ కొత్త డొమైన్లతో మళ్లీ తిరిగి పుట్టుకొస్తుంటాయి. దీని వల్ల సినిమా వాళ్లు ఇచ్చే వార్నింగులు వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపించవు. అయితే ఇప్పుడు సినిమా వాళ్ళు వార్నింగ్ ఇచ్చేది పోయి ఓ పైరసీ వెబ్సైట్ టాలీవుడ్ కే వార్నింగ్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ స్ట్రాంగ్ టాలీవుడ్ కి వార్నింగ్ ఇచ్చింది. “టాలీవుడ్ నిర్మాతలు మాపై ఫోకస్ పెడితే.. మేము మీపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. మా వెబ్సైట్ మధ్యతరగతి వారి కోసమే. వారి కోసం ఏదైనా చేస్తాం. అయినా స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోరు. పైరసీ అయితే సినీ కార్మికులు రోడ్డున పడతారని.. వారి కోసమే పైరసీని అరికడతాం అంటున్నారు. కానీ స్టార్ హీరోలు మాత్రం పారితోషిక తగ్గించుకోరు. మమ్మల్ని టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోము.” అంటూ ఐబొమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ వార్మింగ్ ఇచ్చింది.