in ,

విడియోలో కన్నీళ్లు పెట్టుకున్న దుల్కర్ సల్మాన్

విడియోలో  కన్నీళ్లు పెట్టుకున్న దుల్కర్ సల్మాన్

 

ఓ స్టార్ హీరో తన ఇన్స్టా (instagram) వీడియోలో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వీడియో చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు తీస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే దుల్క‌ర్ సల్మాన్ ఇటీవల అంటే ఆదివారం (జులై 2) రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘కొంత‌కాలంగా నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఇలాంటి దాన్ని తొలిసారి అనుభ‌విస్తున్నాను’ అంటూ ఆ వీడియోలో దుల్క‌ర్ తన మనసులోని అంతు చిక్కని మాటలు అభిమానులతో పంచుకుంటూ కళ్లు తుడుచుకున్నారు.

ఈ వీడియోను చూసిన అభిమానులు, నెటిజనులు అసలు ఆయన అలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు.

What do you think?

పెళ్ళి కాని వారికి పింఛను ఇవ్వనున్న హరియాణా సీఎం

ఈ వర్షా కాలంలో వాటికి రక్షణ కల్పించండి – రతన్ టాటా