in ,

‘ఆదిపురుష్’ కేసులపై విచారణ అనవసరం – సుప్రీం కోర్టు

‘ఆదిపురుష్’ కేసులపై విచారణ అనవసరం – సుప్రీం కోర్టు

‘ఆదిపురుష్’ సినిమాపై సుప్రీం కోర్టు అన్ని కేసులను కొట్టివేసింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చాక.. ఇక విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది.

‘ఆదిపురుష్’ విడుదల అయినప్పటి నుంచి ఈ సినిమా చుట్టూ రకరకాల వివాదాలు నడిచాయి. రామాయణాన్ని తప్పుగా తెరకెక్కించారని, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని కొందరు రోడ్డెక్కితే.. ఇంకొందరు మన పురాణ ఇతిహాసాలను అపహాస్యం చేసేలా ఈ సినిమా ఉందని కోర్టు మెట్లెక్కారు. దీంతో ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల పాటు దుమారం రేపింది.

అయితే తాజాగా ఈ సినిమాపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చాక.. ఈ వివాదంపై విచారణ అనవసరం అని అభిప్రాయపడింది. దీనిపై వివిధ కోర్టులలో జరుగుతున్న కేసులు కూడా కొనసాగడం అనవసరం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు.

What do you think?

యూట్యూబ్‌, టెలిగ్రామ్, ట్విట్టర్‌ లకు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

తన ప్రాణాలు అడ్డుపెట్టి కుటుంబాన్ని కాపాడుకున్నాడు – వైరల్ వీడియో