in ,

టాప్ 5 నెట్ ఫ్లిక్స్ సినిమాలు #పార్ట్ 2

టాప్ 5 నెట్ ఫ్లిక్స్ సినిమాలు

  1. కాల్ (Call 2020)

థ్రిల్లర్ మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన కొరియన్ సినిమా ది కాల్. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా తరువాత ఏం జరుగుతందో అనే ఉత్కంఠతో సాగిపోతుంది. లీ చుంగ్ హియోన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

 

2.మిరేజ్ (Mirage 2018)

స్పానిష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా రూపొందిన సినిమా మిరేజ్. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రతి క్షణం ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ సాగిపోతుంది. ప్రముఖ స్పానిష్ దర్శకుడు ఒరియోల్ పౌలో ఈ సినిమాను తెరకెక్కించగా,అలవారో వర్టే,అడ్రియాన ఊగర్టే,చినో డెరిన్,లునా ఫుల్గేన్సియో ప్రధాన పాత్రలు పోషించారు.

 

  1. శ్యామ్ సింఘ రాయ్ (Shyam Singha Roy 2021)

హీరో నాని ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ రొమాన్స్ యాక్షన్ డ్రామా శ్యామ్ సింఘ రాయ్. ఈ సినిమాలోని సన్నివేశాలు భావోద్వేగబరితంగా నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉంటూ ప్రేక్షకులను అలరిస్థాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాను తెరకెక్కించగా,సాయి పల్లవి,కృతి శెట్టి,మడోనా సెబాస్టియన్,రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలలో నటించారు.

 

4.లగాన్ (Lagaan 2001)

ప్రముఖ హిందీ నటుడు అమీర్ ఖాన్ నటించిన పీరియాడిక్  స్పోర్ట్స్& మ్యూజికల్ డ్రామా లగాన్. ఈ సినిమాలో ఆంగ్లేయులకు భారతీయులకు మధ్య జరిగే క్రెకెట్ మ్యాచ్ హైలైట్. అప్పట్లో భారతదేశం నుండి ఆస్కార్ కు ఎంపికై, త్రుటిలో ఆస్కార్ కోల్పోయిన ఈ సినిమాను దర్శకుడు అశుతోష్ గోవరికర్ తెరకెక్కించారు.

 

5.ఫర్గాటెన్ (Forgotten 2017)

సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సౌత్ కొరియన్ డ్రామా ఫర్గాటెన్.ఈ సినిమాలోని సన్నివేశాలు తరువాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఆసక్తికరంగా ప్రేక్షకులను అలరిస్తూ సాగిపోతుంది.దర్శకుడు జాంగ్ హంగ్ జున్ ఈ సినిమాను రూపొందించారు.

What do you think?

ఈ అమ్మాయి చిన్న వయసులోనే ఎవరెస్ట్ అదిరోహించింది!

టాప్ 5 నెట్ ఫ్లిక్స్ సీరీస్లు పార్ట్ #2