in ,

‘ప్రభాస్ తో నాకు పోటీ ఏంటి?’ – వివేక్ అగ్నిహోత్రి

‘ప్రభాస్ తో నాకు పోటీ ఏంటి?’ – వివేక్ అగ్నిహోత్రి

ప్రభాస్ అంటే తనకి గౌరవం ఉందని అని సెన్సేషనల్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. తను ఎప్పుడూ ప్రభాస్ కు పోటీ అని అనుకొనని అన్నారు.

విషయం ఏంటంటే ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న అగ్నిహోత్రి ఇటీవలి ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ‘రామాయణం’, ‘మహాభారతం’ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ఫ్రీ లైఫ్ కు అలవాటు పడిన కొందరు నటులు దేవుడి పాత్రలు చేస్తున్నారు. వారిని ప్రేక్షకులు ఎప్పటికీ అంగీకరించరు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ప్రభాస్ ను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని ఈ విషయం నెట్టింట వివాదాస్పదంగా మారింది.

మరో వైపు “పోయిన సారి ‘రాధే శ్యామ్’ సినిమాకు పోటీగా ‘కాశ్మీర్ ఫైల్స్’ విడుదల చేసి విజయం సాధించాను. ఇప్పుడు మరో సారి ఈ పోటీని కొనసాగిస్తూ ‘సలార్’ కు పోటీగా ‘ది వ్యాక్సిన్ వార్’ విడుదల చేసి విజయం సాదిస్తాను.” అంటూ అగ్నిహోత్రి చెప్పినట్లు ఇంకో ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

దీంతో ఈ విషయం నెట్టింట మరింత వివాదాస్పదంగా మారుతుండడంతో వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. తనకు ప్రభాస్ అంటే గౌరవం ఉందని, ఆయనకు తను పోటీ అని ఎప్పుడూ భావించనని తెలిపారు. ప్రభాస్ తో నాకు పోటీ ఏంటి? ఆని అన్నారు. “ప్రభాస్ పెద్ద స్టార్. ఆయన భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటారు. నేను పెద్ద స్టార్ లతో కాకుండా చిన్న సినిమాలు చేస్తుంటాను. మాకు పోటీ లేదు.” అని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు.

What do you think?

డేనియల్ కూపర్‌ ఏమయ్యాడు? చనిపోయాడా? మాయమయ్యాడా?

వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికుడి భోజనంలో బొద్దింక